HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Us Calls For End To Gaza War

Gaza : గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా

  • Author : Vamsi Chowdary Korata Date : 30-09-2025 - 3:11 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
gaza
GAZA

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారం నాడు గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ముగించడానికి ఒక కొత్త శాంతి ప్రణాళికపై అంగీకారం కుదుర్చుకున్నట్లు ప్రకటించారు. అయితే ఈ 20-పాయింట్ల ప్రణాళిక పూర్తి విజయం హమాస్ ఆమోదంపై ఆధారపడి ఉంటుంది. తెల్లవారుజామున వైట్‌హౌస్‌లో జరిగిన ఒక సంయుక్త విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. మేము శాంతికి చాలా దగ్గరగా ఉన్నాము, కానీ ఇంకా పూర్తిగా ముగియలేదు. మనం ఇప్పుడు హమాస్ ఆమోదాన్ని పొందాలి” అని చెప్పారు. ఈ ప్రణాళికలో గాజాలో నివసించే పాలస్తీనియన్లు ఎవరూ తమ స్థలాలను వదిలి వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టంగా పేర్కొన్నారు.

ఈ ఒప్పందానికి హమాస్ అంగీకరిస్తే మొదటి 72 గంటల్లోనే మిగిలి ఉన్న బందీలందరినీ విడుదల చేయాలి. ఇలా చేస్తే.. ఇజ్రాయెల్ సైన్యం గాజా నుంచి దశలవారీగా వెనక్కి తగ్గుతుంది. ఒప్పందం అమలులో ఉన్నప్పుడు నియమాలను పర్యవేక్షించడానికి ఒక అంతర్జాతీయ “శాంతి మండలి” ఏర్పాటు చేస్తారు. ఒకవేళ హమాస్ ఈ ప్రణాళికను తిరస్కరిస్తే.. ఇజ్రాయెల్‌కు వాషింగ్టన్ పూర్తి మద్దతు ఇస్తుంది.

నెతన్యాహు మాట్లాడుతూ.. ఈ ప్రణాళిక ఇజ్రాయెల్ యుద్ధ లక్ష్యాలకు అనుగుణంగా ఉందని చెప్పారు. “ఈ ప్రణాళిక మా యుద్ధ లక్ష్యాలను నెరవేరుస్తుంది. ఇది మా బందీలందరినీ ఇజ్రాయెల్‌కు తిరిగి తీసుకువస్తుంది. హమాస్ సైనిక సామర్థ్యాలను, రాజకీయ పాలనను ధ్వంసం చేస్తుంది. అలాగే గాజా మళ్లీ ఇజ్రాయెల్‌కు ఎప్పుడూ ముప్పుగా మారకుండా చేస్తుంది” అని ఆయన అన్నారు. హమాస్ ఈ ప్రణాళికను తిరస్కరించినా లేదా అంగీకరించినట్లు నటించి అడ్డుకున్నా.. ఇజ్రాయెల్ ఒంటరిగా ఈ పనిని పూర్తి చేస్తుందని నెతన్యాహు తీవ్రంగా హెచ్చరించారు. “ఈ పనిని సులభంగా లేదా కఠినంగా అయినా పూర్తి చేస్తాం” అని ఆయన అన్నారు. ఈ ప్రణాళిక భవిష్యత్తులో జరిగే రక్తపాతాన్ని నివారిస్తుందని.. గాజాకు ఒక ఆచరణాత్మకమైన మార్గాన్ని అందిస్తుందని నెతన్యాహు అభిప్రాయపడ్డారు.

ఖతర్ ప్రధాన మంత్రి, ఈజిప్ట్ ఇంటెలిజెన్స్ చీఫ్ ట్రంప్ ప్రణాళికను హమాస్ సంధానకర్తలకు సమర్పించారు. ఈ ప్రణాళికను మంచి ఉద్దేశంతో పరిశీలిస్తామని.. త్వరలో దీనిపై స్పందన ఇస్తామని హమాస్ ప్రతినిధులు మధ్యవర్తులకు తెలిపారు. ఈ ఒప్పందం ప్రకటనకు ముందు.. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఇజ్రాయెల్ దాడిలో ఒక ఖతర్ సైనికుడు మరణించడంపై నెతన్యాహు అధికారికంగా ఖతర్‌కు క్షమాపణలు చెప్పారు. ఇజ్రాయెల్ హమాస్ లక్ష్యంగానే ఆ దాడి చేసింది. కానీ అనుకోకుండా ఖతర్ సైనికుడు చనిపోయారని వైట్‌హౌస్ తెలిపింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Donald Trump
  • Gaza
  • Hamas
  • netanyahu
  • USA

Related News

Donald Trump Pm Modi

భారత్‌కు మరో సారి ట్రంప్ గుడ్‌న్యూస్.. అదనపు టారిఫ్ లను 25 % నుంచి 18% శాతానికి తగ్గింపు

Trade Deal  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ కు శుభవార్త చెప్పారు. ఇటీవల భారత్ పై విధించిన ప్రతీకార సుంకాల (25 శాతం) ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రష్యా నుంచి చమురు దిగుమతులను ఆపేసే విషయంలో భారత్ కట్టుబడి ఉందని, దీంతో టారిఫ్ లను తగ్గిస్తున్నామని ట్రంప్ చెప్పారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై ఆయన శుక్రవారం సంతకం చేశారు. అమెరికా, భారత్ ల మధ్య ఇటీవల కుదిరిన ట్రేడ్ డ

  • SAVE Act Bills

    సేవ్ అమెరికా చట్టం అంటే ఏమిటి?

  • Dancing Missile

    సైనిక శక్తిని మరింత పటిష్టం చేసుకున్న ఇరాన్‌.. రంగంలోకి సెజ్జిల్-2 బాలిస్టిక్ మిసైల్!

  • Russia- America

    అమెరికా-రష్యా మధ్య ముగిసిన ‘న్యూ స్టార్ట్’ ఒప్పందం.. అణు యుద్ధ భయం!

  • Elon Musk

    జీడీపీలో భారత్ వరల్డ్ నెంబర్ 2.. ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్..!

Latest News

  • నమీబియాతో తలపడనున్న భారత్.. టీమిండియాలో ఐదు కీలక మార్పులు!

  • కొత్త ఆదాయపు పన్ను చట్టం.. ఏప్రిల్ 1 నుండి అమలు!

  • FSLలో అగ్నిప్రమాదం రేవంత్ పనే – కేటీఆర్

  • అర్ధరాత్రి వేళ పదే పదే విరేచనానికి వెళ్తున్నారా?

  • టీ20 వరల్డ్ కప్ 2026.. ఈ ఆట‌గాళ్లంతా భార‌త సంత‌తికి చెందిన ఆట‌గాళ్లే!

Trending News

    • భారత్-పాక్ మ్యాచ్ బహిష్కరణ.. పీసీబీ నిర్ణయంపై గంగూలీ విస్మయం!

    • సిరాజ్ ‘బిర్యానీ’ తింటూ వచ్చి వికెట్లు తీశాడు: మాజీ క్రికెట‌ర్‌

    • విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

    • అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?

    • టీమిండియాకు చెమ‌టలు ప‌ట్టించిన యూఎస్ఏ!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd