UPI Transactions: రికార్డు స్థాయిలో UPI లావాదేవీలు
యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మనీ ట్రాన్సఫరింగ్ వెసులుబాటు కల్పించింది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది డబ్బులను బదిలీ చేస్తున్నారు.
- Author : Praveen Aluthuru
Date : 24-06-2023 - 2:30 IST
Published By : Hashtagu Telugu Desk
UPI Transactions: యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మనీ ట్రాన్సఫరింగ్ వెసులుబాటు కల్పించింది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది డబ్బులను బదిలీ చేస్తున్నారు. UPI మే నెలలో రికార్డు స్థాయిలో 9 బిలియన్ లావాదేవీలను జరిపింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఇటీవల విడుదల చేసిన డేటా ప్రకారం ఈ సమాచారం అందింది. NPCI ప్రకారం మేలో UPI లావాదేవీల మొత్తం విలువ 14.3 ట్రిలియన్లు. ఏప్రిల్‌లో 14.07 లక్షల కోట్ల విలువైన 8.89 బిలియన్ లావాదేవీలు నమోదు కాగా, మార్చిలో 14.05 లక్షల కోట్ల విలువైన 8.7 బిలియన్ లావాదేవీలు నమోదయ్యాయి.
కాగా వచ్చే ఐదేళ్లలో 90 శాతం రిటైల్ డిజిటల్ లావాదేవీలు యూపీఐ ద్వారా జరుగుతాయని ఆర్బీఐ తాజాగా బులిటెన్ విడుదల చేసింది. అదేవిధంగా ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా టోల్ ప్లాజాకు 90 శాతానికి పైగా లావాదేవీలను అందుకుందని, ఈ క్రమంలో 70 శాతం ఫాస్ట్‌ట్యాగ్ ద్వారా చెల్లింపులు పెరిగినట్టు ఆర్బీఐ పేర్కొంది.
Read More: Lab Grown Meat : ల్యాబ్ లో చికెన్ తయారీ.. అమెరికాలో సేల్స్ షురూ