Lab Grown Meat : ల్యాబ్ లో చికెన్ తయారీ.. అమెరికాలో సేల్స్ షురూ
Lab Grown Meat : జంతు ప్రేమికులకు గుడ్ న్యూస్.. జంతువధ చేయకుండానే ఇక మాంసం లభిస్తుంది..
- By Pasha Published Date - 12:29 PM, Sat - 24 June 23
Lab Grown Meat : జంతు ప్రేమికులకు గుడ్ న్యూస్..
జంతువధ చేయకుండానే ఇక మాంసం లభిస్తుంది..
ల్యాబ్లో తయారు చేసే కోడి మాంసం సేల్స్ దిశగా ఒక అడుగు ముందుకు పడింది. ల్యాబ్ తయారీ కోడి మాంసాన్ని మార్కెట్లో విక్రయించేందుకు అమెరికా వ్యవసాయ శాఖ 2 కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ల్యాబ్ లో తయారయ్యే చికెన్ ను సేల్ చేసుకునేందుకు కాలిఫోర్నియాకు చెందిన అప్సైడ్ ఫుడ్స్ , ఈట్ జస్ట్ కంపెనీలకు పర్మిషన్ లభించింది. అమెరికాలోని ఎంపిక చేసిన కొన్ని రెస్టారెంట్లలో ఈ ల్యాబ్ చికెన్ త్వరలో అందుబాటులోకి వస్తుందని కంపెనీలు తెలిపాయి. ఈ మాంసం వినియోగానికి సురక్షితమే అని అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ డిసైడ్ చేసింది. దీంతో ప్రపంచంలో ఇప్పటివరకు ల్యాబ్ తయారీ కోడి మాంసాన్ని(Lab Grown Meat) ఆమోదించిన రెండో దేశంగా అమెరికా నిలిచింది. ఈ నిర్ణయం తీసుకున్న మొదటి దేశం సింగపూర్.
ల్యాబ్ లో మాంసం తయారీ ఇలా..
ఇంతకీ జంతువుల మాంసానికి, ల్యాబ్లో తయారు చేస్తున్న కొత్త రకం మాంసానికి తేడా ఏమిటి ? అనే దానిపై ఇప్పుడు డిస్కషన్ నడుస్తోంది. దానిపై ఒక లుక్ వేద్దాం. ఉదాహరణకు కోడి మాంసాన్ని ల్యాబ్ లో తయారు చేయాలని భావిస్తే .. బతికి ఉన్న ఒక కోడికి మత్తుమందు ఇచ్చి దాని శరీరం నుంచి కొన్ని సజీవ శరీర కణాలను సేకరిస్తారు. ఈ కణాలను అమైనో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, షుగర్, మినరల్స్, విటమిన్లతో కూడిన మిశ్రమం నింపిన ఒక ట్యాంకులో నిల్వ చేస్తారు. ఈ మిశ్రమంలో కలిసిపోయి కోడి కణాలు కృత్రిమంగా పెరగడానికి అవసరమైన ఉష్ణోగ్రతను శాస్త్రవేత్తలు క్రియేట్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత ట్యాంకులోని కోడి కణాలు మాంసం యొక్క పెద్ద షీట్లుగా పెరుగుతాయి. దాదాపు 3 వారాల తర్వాత అవి మాంసం ముక్కల్లా తయారవుతాయి. చూడటానికి రియల్ మాంసమే అనిపిస్తుంది. లుక్ , టేస్ట్ .. సేమ్ టు సేమ్ ఒరిజినల్ చికెన్ లానే ఉంటుంది. అయితే సాధారణ కోడి మాంసం కంటే కొద్దిగా పాలిపోయిన కలర్ ఉంటుంది.
రేటు ఎంత ? ప్రపంచమంతా ఎప్పుడు?
మార్కెట్లో ఈవిధమైన ల్యాబ్ చికెన్ విరివిగా లభించడానికి ఇంకో పదేళ్లు టైం పట్టొచ్చు. ల్యాబ్ లో తయారైన చికెన్ ధర.. సాధారణ చికెన్ ధర కంటే కాస్ట్లీ. భవిష్యత్తులో ఉత్పత్తి టెక్నాలజీ అప్ డేట్ అయితే రేట్లు తగ్గొచ్చు. అయితే ఇలాంటి మాంసాన్ని వివిధ మతాలు ఏ కోణంలో చూస్తాయనే దానిపై ఇంకా స్పష్టత లేదు.
Related News
Telugu Students : విహార యాత్రలో విషాదం.. అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
Telugu Students : అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృత్యువాత పడ్డారు.