Twitter Logo: ట్విటర్ లోగో మారింది
ట్విటర్ (Twitter) లోగో మారింది. తొలి నుంచి ఉన్న ‘బ్లూ బర్డ్’ను తీసేశారు!
- By Hashtag U Published Date - 01:49 PM, Tue - 4 April 23

వాషింగ్టన్: ట్విటర్ (Twitter) లోగో మారింది. తొలి నుంచి ఉన్న ‘బ్లూ బర్డ్’ను తీసేశారు! దాని స్థానంలో క్రిప్టో కరెన్సీ అయిన ‘డోజీకాయిన్’కు సంబంధించిన డోజీ మీమ్ ను ఉంచారు.
వేకువజామున ట్విటర్ యూజర్లకు ఈ కొత్త లోగో దర్శనమిచ్చింది. దీన్ని ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్ సైతం ధ్రువీకరించారు. బ్లూ బర్డ్ ఇక పాతదని.. ఇకపై ఈ డోజీ మీమే కొత్త లోగో అని ఉన్న ఓ మీమ్‌ను ట్వీట్ చేశారు.
— Elon Musk (@elonmusk) April 3, 2023