HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Tsunami Warnings In New Zealand

New Zealand: న్యూజిలాండ్‌లో సునామీ హెచ్చరికలు..

  • Author : Vamsi Chowdary Korata Date : 16-07-2026 - 5:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tsunami warnings in New Zealand...
Tsunami warnings in New Zealand...

న్యూజిలాండ్‌లో భూకంపం సంభవించింది. దేశంలోని దక్షిణ దీవిలో గురువారం 6.3 తీవ్రతతో భూమి కంపించడంతో అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పశ్చిమ తీర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

వివరాల్లోకి వెళితే, ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఫియోర్డ్‌ల్యాండ్ రీజియన్‌లోని టె అనౌకు 40 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ భూకంపం కారణంగా మిల్ఫోర్డ్ సౌండ్ నుంచి ప్యూసెగుర్ పాయింట్ వరకు ఉన్న దక్షిణ దీవి పశ్చిమ తీరానికి సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సముద్రపు అలలు తీరప్రాంతాల్లోకి చొచ్చుకువచ్చే ప్రమాదం ఉందని, ప్రజలు తక్షణమే ఎత్తైన ప్రదేశాలకు లేదా లోతట్టు ప్రాంతాల నుంచి దూరంగా వెళ్లాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు నడిచి, పరిగెత్తి లేదా సైకిళ్లపై సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

ఆస్ట్రేలియన్, పసిఫిక్ టెక్టానిక్ ప్లేట్ల సరిహద్దులో న్యూజిలాండ్ ఉండటంతో ఇక్కడ తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. 2011లో సంభవించిన క్రైస్ట్‌చర్చ్ భూకంపం 185 మందిని బలిగొన్న విషయం తెలిసిందే.

తాజా భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం గానీ, ప్రధాన ఆస్తి నష్టం గానీ జరిగినట్లు ఇంకా సమాచారం అందలేదని, పరిస్థితిని సమీక్షిస్తున్నామని జాతీయ అత్యవసర నిర్వహణ ఏజెన్సీ (ఎన్ఈఎంఏ) అధికారులు తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Earthquake In New Zealand
  • NEMA
  • tsunami warning

Related News

    Latest News

    • Bhagyanagaramloo Saradhi Prema : ‘భాగ్యనగరంలో సారథి ప్రేమ’ టాక్

    • New Zealand: న్యూజిలాండ్‌లో సునామీ హెచ్చరికలు..

    • Ice Cream: ఐస్‌క్రీమ్ ఎక్కువగా తింటున్నారా? క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.. మ‌హిళ‌లు త‌ప్పనిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు ఇవే!

    • Egg Price Hike: కొండెక్కిన గుడ్డు.. రికార్డు స్థాయికి కోడిగుడ్డు ధరలు

    • KTR: చంద్రబాబు పనితీరును కొనియాడిన కేటీఆర్‌

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd