Trump Effect : మార్కెట్లకు పరుగులు పెడుతున్న అమెరికన్లు
Trump Effect : ముఖ్యంగా విదేశీ వస్తువులపై సుంకాలు (Trump Tariffs) విధించడం వల్ల ప్రజల్లో ఆందోళన నెలకొంది
- Author : Sudheer
Date : 06-04-2025 - 9:40 IST
Published By : Hashtagu Telugu Desk
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీసుకున్న తాజా ఆర్థిక నిర్ణయాలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా విదేశీ వస్తువులపై సుంకాలు (Trump Tariffs) విధించడం వల్ల ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ ప్రభావంతో రాబోయే రోజుల్లో వస్తువుల ధరలు (Prices) భారీగా పెరిగే అవకాశం ఉండటంతో, ప్రజలు ముందస్తుగానే షాపింగ్‌కు ఎగబడుతున్నారు. సూపర్ మార్కెట్లు, ఎలక్ట్రానిక్ షోరూమ్‌లు, దుస్తుల షాపులు, కార్ షోరూమ్‌లు ఎక్కడ చూసినా కొనుగోలుదారుల గుమిగూడడం కనిపిస్తోంది. ఫోన్లు, ల్యాప్టాపులు, కార్లు, బూట్లు వంటి ఉత్పత్తులకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.
AI : 140 కోట్ల ఉద్యోగాలపై ఏఐ ఎఫెక్ట్..?
మరోవైపు ట్రంప్ విధానాలపై అమెరికా వ్యాప్తంగా నిరసనలు బలంగా వ్యక్తమవుతున్నాయి. వలసదారులపై కఠినమైన విధానాలు, కార్మిక హక్కుల ఉల్లంఘనలు, ఉద్యోగాల తొలగింపులు వంటి అంశాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని 50 రాష్ట్రాల్లో 1200 నిరసన కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. పౌరహక్కుల సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. “ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నాం” అంటూ నినాదాలతో రోడ్లు దద్దరిల్లాయి.
Sanna Biyyam Distribution : ‘పేదవాడు’ సంపన్నులు తినే సన్నబియ్యం తింటున్నారు – కోమటిరెడ్డి
ఈ పరిణామాలు అమెరికా రాజకీయ, ఆర్థిక పరిస్థితులను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. ఒకవైపు మార్కెట్లలో భయం వల్ల కొనుగోళ్ల హడావుడి కొనసాగుతుండగా, మరోవైపు ప్రజలలో ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతుంది. ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు దేశ ప్రజల జీవన స్థాయిపై ఏమేరకు ప్రభావం చూపుతాయో చూడాలి.