Sanna Biyyam Distribution : ‘పేదవాడు’ సంపన్నులు తినే సన్నబియ్యం తింటున్నారు – కోమటిరెడ్డి
Sanna Biyyam Distribution : రాష్ట్రంలో ఉన్న ధనిక, పేద అనే తేడాలేకుండా అందరి కంచాల్లో ఇక సన్నబియ్యమే ఉండేలా.. ఇందిరమ్మ రాజ్యంలో సన్న బియ్యం పంపిణీ
- Author : Sudheer
Date : 06-04-2025 - 9:06 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ పథకం సామాజిక సమానత్వానికి మార్గం వేస్తుందంటూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో పేదలు తినే బియ్యం నాణ్యతలో తక్కువగా ఉండేది. దొడ్డు బువ్వను తినడం అనేది ఒక భారంగా మారేది. ఆకలి ఉన్నా తినాలా వద్దా అనే పరిస్థితి ఉండేదని మంత్రి గుర్తుచేశారు. ఈ బాధను తాము అర్థం చేసుకున్నామని తెలిపారు.
Raghavulu : సీపీఎం చీఫ్ రేసులో బీవీ రాఘవులు.. ఆ ఇద్దరే కీలకం
ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా ఇకపై అందరి కంచాల్లో సన్నబియ్యం ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఇది కేవలం ఓ రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమం కాదని, ఒక సామాజిక విప్లవం అని పేర్కొన్నారు. ‘పేదోడు కూడా సంపన్నులు తినే నాణ్యమైన బియ్యమే తింటున్నాడు’ అనే మాటలు ఈ పథకం విజయాన్ని ప్రతిబింబిస్తున్నాయి. పౌష్టికాహార హక్కు అందరికీ సమానంగా ఉండాలన్నదే ఈ పాలకుల లక్ష్యంగా కనిపిస్తోంది.
PBKS vs RR: మైదానంలో లైవ్ మ్యాచ్ జరుగుతోంది.. హాయిగా నిద్రపోయిన జోఫ్రా ఆర్చర్.. వీడియో వైరల్
ప్రభుత్వ చర్యల ద్వారా పేదలకు గౌరవం లభించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పౌరసరఫరాల వ్యవస్థలో ఈ మార్పు వలన పేద ప్రజలకు తినే అన్నం మీద ఉన్న అసంతృప్తి తొలగిపోతుంది. భవిష్యత్‌లో మరిన్ని ఇలాంటి సంక్షేమ పథకాలు ప్రజల జీవితాలలో అసలు మార్పు తీసుకురావాలని అందరూ ఆశిస్తున్నారు.
దొడ్డు బువ్వ అనంగనే సగం ఆకలి చచ్చిపోతుంది..
తినాలని లేకున్నా కాసిన్ని మెతుకులు నోట్లో కుక్కుకోవాలి..
సగం కడుపుతోనే కాలం వెళ్లదీయాలి ఇదీ పేదోడి దుస్థితి!రాష్ట్రంలో ఉన్న ధనిక, పేద అనే తేడాలేకుండా అందరి కంచాల్లో ఇక సన్నబియ్యమే ఉండేలా.. ఇందిరమ్మ రాజ్యంలో సన్న బియ్యం పంపిణీ పథకంతో… pic.twitter.com/RDmOK7Y4XC
— Komatireddy Venkat Reddy (@KomatireddyKVR) April 5, 2025