War: ప్రాణాలు తీస్తున్న ఉక్రెయిన్, రష్యా యుద్ధం.. ఎంతమంది చనిపోయారో తెలుసా
- By Balu J Published Date - 11:50 PM, Mon - 26 February 24
War: రష్యా దాడి వల్ల తమ దేశానికి చెందిన 31 వేల మంది సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తెలిపారు. అయితే రెండేళ్లుగా సాగుతున్న యుద్ధంలో ఎంత మంది సైనికులు గాయపడ్డారన్న విషయాన్ని వెల్లడించబోనని జెలెన్స్కీ చెప్పారు. ఎందుకంటే ఆ అంశం రష్యా సైన్యానికి ఊతం ఇచ్చినట్లుగా ఉంటుందని ఆయన అన్నారు. ఇప్పటి వరకు ఉక్రెయిన్ అధికారికంగా మృతుల సంఖ్యను వెల్లడించిన సందర్భాలు తక్కువే.
కానీ కొందరి అంచనాల ప్రకారం ఆ సంఖ్య భారీగానే ఉంటుందని భావిస్తున్నారు. జెలెన్స్కీ మృతుల వివరాలను వెల్లడించారు. మృతుల సంఖ్యపై రష్యా తప్పుడు సమాచారం ఇస్తోందని, అందుకే మృతి చెందిన ఉక్రెయిన్ సైనికుల సంఖ్యను ప్రకటించినట్లు జెలెన్స్కీ చెప్పారు. తాజా యుద్ధంలో ఇప్పటి వరకు 31000 మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయారని, మూడు లక్షలో లేక లక్షన్నరో కాదు అని ఆయన అన్నారు. పుతిన్ బృందం చెబుతున్నది నిజం కాదు అని, కానీ తమకు జరిగిన నష్టం తీవ్రమైందే అని ఆయన అన్నారు.యుద్ధంలో సాధారణ పౌరులు చనిపోయిన సంఖ్యను ఆయన వెల్లడించలేదు.
కానీ రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగంలో వేల సంఖ్యలో పౌరులు మృతిచెందినట్లు భావిస్తున్నామని అన్నారు. హత్యకు గురైనవారు, వేధింపులకు గురైనవారు, డిపోర్టేషన్‌కు గురైనవారి సంఖ్య తెలియదన్నారు.రష్యా దాడిలో సుమారు 70 వేల మంది ఉక్రెయిన్ సైనికులు మృతిచెందినట్లు గత ఆగస్టులో అమెరికా తెలిపింది. సుమారు లక్షా 20 వేల మంది గాయపడి ఉంటారని పేర్కొన్నది. అయితే ఈ యుద్ధంలో రష్యాకు చెందిన 1,80,000 మంది సైనికులు మృతిచెందారని జెలెన్స్కీ తెలిపారు.
Related News
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో హ్యారీ పోటర్ కోట ధ్వంసం
హ్యారీ పోటర్ సిరీస్ లో ఓ భారీ కోట అందరికి తెలిసే ఉంటుంది. ఆ భవనం ఉక్రెయిన్‌లోని ఒడెస్సా నగరంలో ఉంది. ఇప్పుడు ఇది రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా నాశనం అయింది. ఈ విద్యా సంస్థ భవనంపై రష్యన్ క్షిపణి దాడి చేసింది.