Pasola Festival: పచ్చని పొలాల్లో పసోలా పండుగ.. పెద్ద యుద్ధమే!!
ఇండోనేషియా(Pasola Festival) దేశం ఇందుకు అతీతమేం కాదు.
- By Pasha Published Date - 04:10 PM, Sun - 9 March 25

Pasola Festival: పసోలా పండుగ వేడుక వచ్చిందంటే .. పెద్ద యుద్ధం జరిగినట్టే. అది కూడా పచ్చటి పొలాల్లో. యువకులంతా ఈటెలు చేతపట్టి, గుర్రాలపై స్వారీ చేస్తూ పొలంలో రక్తం చిందేదాకా పరస్పరం తలపడతారు. కనీసం ఎవరిదైనా ఒకరి రక్తం చిందిన వెంటనే ఈ విచిత్ర వేడుక ఆగిపోతుంది. పంటసాగు కాలం ప్రారంభాన్ని పురస్కరించుకొని ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో పసోలా పండుగను జరుపుకుంటారు. వివరాలివీ..
Also Read :Immunity For One Murder: ఒక్క హత్యకైనా మహిళలను అనుమతించాలి.. రాష్ట్రపతికి సంచలన లేఖ
సుంబా ప్రజలు
మన దేశంలోనూ పలు సంప్రదాయ వేడుకలు రక్తం చిందేలా జరుగుతుంటాయి. ఇండోనేషియా(Pasola Festival) దేశం ఇందుకు అతీతమేం కాదు. అక్కడ కూడా చాలా ప్రాచీన తెగల ప్రజలు ఉన్నారు. వారంతా తమ పూర్వీకుల ఆచారాలు, సంప్రదాయాలను తు.చ తప్పకుండా పాటిస్తుంటారు. ఇండోనేషియా తూర్పు ప్రాంతంలోని సుంబా దీవి ప్రజలు ఈ కోవలోకే వస్తారు. వారంతా జరుపుకునే విచిత్ర పండుగే మనం చెప్పుకున్న ‘పసోలా’.
Also Read :Telangana Congress: ‘జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్’ సమన్వయ కమిటీ
పసోలా వేడుక ఇలా..
- పసోలా పండుగ అనగానే సుంబా దీవి ప్రజలకు ఈటెల పోటీ గుర్తుకు వస్తుంది.
- సుంబా దీవిలో శారీరక బలం కలిగిన వారంతా ఈటెల పోటీలో పాల్గొంటారు. మహిళలు, పెద్ద వయస్కులు, రోగగ్రస్తులు, పిల్లలు పాల్గొనరు.
- ఈ పోటీలో పాల్గొనే వారి వయసు సగటున 14 నుంచి 40 ఏళ్లలోపు ఉంటుంది.
- ప్రతీ పోటీదారుడు తన గుర్రంపై కూర్చొని, చేతిలో ఈటెను పట్టుకోవాలి.
- పోటీలో పాల్గొనే వారిలో కనీసం ఎవరో ఒకరిని తాకేలా గుర్రం పై నుంచే ఈటెను వేగంగా, కచ్చితత్వంతో విసరాలి.
- చాలామందికి ఈ ఈటెలు తాకి గాయాలు అవుతుంటాయి.
- ఈ పోటీలో పాల్గొనే వ్యక్తి గుర్రం పై నుంచి దిగిపోతే.. అతడిపైకి ఎవరూ ఈటెను విసరరు. ఇలా దిగే వ్యక్తి పోటీ నుంచి తప్పుకున్నట్టే.
- మొట్టమొదట కనీసం ఒక్కరికైనా తమ ఈటెను సూటిగా తాకించే వారే విజేతగా నిలుస్తారు.
- ఈసారి పోటీల్లో ఒక వ్యక్తి ముక్కును ఈటె తాకింది. దీంతో దాన్ని సంధించిన వ్యక్తిని విజేతగా ప్రకటించారు.
- పసోలా వేడుకలో కీలకమైన విషయం ఏమిటంటే.. ఈ పోటీలు జరిగే పొలాల్లో కనీసం చుక్క రక్తమైనా పడాలి. అప్పుడే పంటసాగును స్థానికులు మొదలుపెడతారు.
- కొన్నేళ్ల క్రితం ఈ పోటీ జరుగుతుండగా.. ఒక వ్యక్తి కంటిలోకి ఈటె దిగింది. అతడు చికిత్స పొందుతూ చనిపోయాడు.