Immunity For One Murder: ఒక్క హత్యకైనా మహిళలను అనుమతించాలి.. రాష్ట్రపతికి సంచలన లేఖ
‘‘కనీసం ఒక హత్య చేసినా, బాధిత మహిళకు చట్టపరమైన(Immunity For One Murder) రక్షణను కల్పించడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం’’ అని రోహిణి అభిప్రాయపడుతున్నారు.
- By Pasha Published Date - 03:12 PM, Sun - 9 March 25

Immunity For One Murder: దేశంలోని మహిళలపై రోజురోజుకు నేరాలు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ – శరద్ పవార్ వర్గం మహిళా విభాగం అధ్యక్షురాలు రోహిణీ ఖడ్సే కీలక అంశాన్ని తెరపైకి తెచ్చారు. తనపై జరిగే నేరాన్ని అడ్డుకునే క్రమంలో బాధిత మహిళ పొరపాటున ఒక హత్య చేసినా, దోషిగా తేలకుండా చట్టపరమైన రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు సంచలన ప్రతిపాదనతో ఎన్‌సీపీ-ఎస్‌పీ మహిళా విభాగం తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రోహిణి లేఖ రాశారు. ఇప్పుడు దీని గురించి భారతదేశ న్యాయవర్గాల్లో చర్చ నడుస్తోంది.
Also Read :Telangana Congress: ‘జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్’ సమన్వయ కమిటీ
రాష్ట్రపతికి రాసిన లేఖలో..
‘‘కనీసం ఒక హత్య చేసినా, బాధిత మహిళకు చట్టపరమైన(Immunity For One Murder) రక్షణను కల్పించడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం’’ అని రోహిణి అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల వనితలపై వేధింపులకు పాల్పడేవారు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉంటారని ఆమె చెప్పారు. అలాంటి నీచులకు ప్రాణభయం పట్టుకుంటుందన్నారు. కొన్ని రోజుల క్రితమే ముంబైలో 12 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన వివరాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిన లేఖలో రోహిణి ఖడ్సే ప్రస్తావించారు. భారతదేశం మహిళలకు అత్యంత అసురక్షిత దేశం అని పేర్కొంటూ ప్రచురితమైన ఒక సర్వే నివేదిక వివరాలను కూడా లేఖలో పొందుపరిచారు. మహిళలపై దేశవ్యాప్తంగా కిడ్నాప్, గృహ హింస వంటి నేరాలు జరుగుతుండటాన్ని తీవ్రంగా పరిగణించాలని రాష్ట్రపతి ముర్మును రోహిణి కోరారు.
Also Read :Kalpana: వారిపై కఠిన చర్యలు తీసుకోండి.. తెలంగాణ మహిళా కమిషనర్ ను ఆశ్రయించిన సింగర్ కల్పనా!
ఇంటర్నెట్ వేదికగా..
ఈ అంశంపై ఇంటర్నెట్ వేదికగా కూడా చర్చ నడుస్తోంది. చాలామంది నెటిజన్లు రోహిణి వాదనతో ఏకీభవిస్తున్నారు. ఇలాంటి నిబంధన అమల్లోకి తెచ్చినా నష్టమేం ఉండదని, తప్పుచేసే నీచులకు మాత్రమే దానివల్ల నష్టం కలుగుతుందని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు. హత్య చేసినా రక్షణ కల్పించే నిబంధనను కొందరు దుర్వినియోగం చేసే అవకాశాలు లేకపోలేదని ఇంకొందరు చెబుతున్నారు.