Most Spoken Language: ప్రపంచంలో అత్యధిక ప్రజలు మాట్లాడే భాష ఇదే..!
ఈ రోజు ప్రపంచీకరణ యుగంలో ఇతర భాషలు మాట్లాడే వ్యక్తులు ప్రతి దేశంలో కనిపిస్తారు. అయితే ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు ఏ భాష (Most Spoken Language) మాట్లాడుతున్నారో మీకు తెలుసా?
- By Gopichand Published Date - 06:36 AM, Sun - 16 July 23

Most Spoken Language: ప్రపంచవ్యాప్తంగా విభిన్న సంస్కృతులు, నాగరికతలు, భాషలు పుట్టాయి. ఈ రోజు ప్రపంచీకరణ యుగంలో ఇతర భాషలు మాట్లాడే వ్యక్తులు ప్రతి దేశంలో కనిపిస్తారు. అయితే ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు ఏ భాష (Most Spoken Language) మాట్లాడుతున్నారో మీకు తెలుసా? ఈ అగ్ర భాషల జాబితాలో భారతదేశంలో ఒకటి కాదు రెండు భాషలు ఉన్నాయని తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఈ కథనం ద్వారా ప్రపంచంలో ఏ భాష ఎక్కువగా మాట్లాడతారు.. భారతదేశంలోని ఏ భాషలు అందులో చేర్చబడ్డాయి అనే సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంగ్లీష్ ఎక్కువగా మాట్లాడే భాష
ప్రపంచం మొత్తంలో ఎక్కువగా మాట్లాడే భాష ఇంగ్లీష్. దీనిని మొదటి భాషగా ఉపయోగించే వారి సంఖ్య మాండరిన్ (చైనీస్ భాష) కంటే తక్కువగా ఉన్నప్పటికీ, ఇది రెండవ భాషగా అత్యధికంగా ఉపయోగించబడింది. మొత్తంమీద ఇది ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషగా మారింది.
ప్రపంచంలో అత్యధిక ప్రజలు మాట్లాడే భాషగా ఇంగ్లీష్ నిలిచింది. ఈ విషయాన్ని వరల్డ్ ఆఫ్ స్టాటిక్స్ ట్విటర్‌లో వెల్లడించింది. 1వ స్థానంలో ఇంగ్లీష్ 113.2 కోట్ల మంది, 2వ ప్లేస్‌లో చైనా మాండరిన్ 111.7 కోట్ల మంది, 3వ స్థానంలో భారతీయ భాష హిందీ 61.5 కోట్ల మంది మాట్లాడుతున్నారని పేర్కొంది. టాప్-50 భాషల్లో భారత్‌కు చెందిన బెంగాలీ (26.5 కోట్ల మంది) 7వ స్థానంలో, తెలుగు (9.3 కోట్ల మంది) 16వ స్థానంలో ఉన్నాయి.
Also Read: Wimbledon 2023: వింబుల్డన్ విజేత్ వొండ్రుసోవా
హిందీ ప్రపంచంలో మూడవ అతిపెద్ద భాష
హిందీ భాష మాట్లాడేవారు ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్నారు. 60 కోట్ల మందికి పైగా హిందీ మాట్లాడతారు. భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా హిందీ మాట్లాడే వారి సంఖ్య చాలా ఎక్కువ. బెంగాలీ భాష మాట్లాడే వారి సంఖ్య ప్రపంచంలో ఏడవ స్థానంలో ఉంది. ప్రపంచంలోని టాప్ 20 భాషల్లో అనేక భారతీయ భాషలు ఉన్నాయి. వీటిలో ఉర్దూ, మరాఠీ, తెలుగు, తమిళ భాషలు ఉన్నాయి.