Texas : అమెరికా టెక్సాస్‌లో వర్షబీభత్సం.. కళ్ల ముందే రోడ్లు మాయం.. 82 మంది మృతి
Texas : టెక్సాస్‌ను అతలాకుతలం చేసిన ప్రకృతి విలయం ప్రస్తుతం అమెరికాలో తీవ్ర భయాందోళన కలిగిస్తోంది.
- By Kavya Krishna Published Date - 06:54 PM, Mon - 7 July 25

Texas : అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వర్ష విరుచుకుపడింది. మానవాళిని కన్నీళ్లు పెట్టించేలా ప్రకృతి ఉగ్రరూపం చూపించింది. గత కొన్ని రోజులుగా కుండపోతగా పడుతున్న వర్షాలు ఒక్కసారిగా ప్రజల జీవితాలను తలకిందులు చేశాయి. ముఖ్యంగా లానో నది, గ్వాడల్పే నది పరివాహక ప్రాంతాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. కొన్ని చోట్ల చూడ్డానికి ఉన్న రోడ్లు, నిర్మాణాలు మాయం కావడం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది.
ప్రజలు చూస్తుండగానే రోడ్లు నదుల్లా మారిపోవడం, భారీ ప్రవాహాలు ఊహించని విధంగా ఊహించని ప్రదేశాల్లోకి ప్రవేశించడం.. ఈ విధ్వంసానికి నిదర్శనం. సామాజిక మాధ్యమాల్లో ఈ దృశ్యాలు వైరల్ అవుతుండటంతో దేశవ్యాప్తంగా వణుకు రేపుతోంది. మానవ నిర్మిత రక్షణ పద్ధతులపై ప్రజల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయి.
Policy : రూ. 20 లకే లక్ష రూపాయల పాలసీ..ఎక్కడంటే !!
గ్వాడల్పే నది ఒడ్డున ఉన్న క్యాంప్ మిస్టిక్‌లో మరో విషాద ఘటన చోటుచేసుకుంది. 10 మంది బాలికలు, ఒక కౌన్సలర్ సహా మొత్తం 11 మంది ఒక్కసారిగా వరదలో కొట్టుకుపోయారు. కేవలం రెండు గంటల వ్యవధిలోనే క్యాంప్ పూర్తిగా 20 అడుగుల వరద నీటిలో మునిగిపోవడం గమనార్హం. ఇది వరద తీవ్రతను సూచించే అత్యంత ఘోర ఉదాహరణగా నిలిచింది.
ఇప్పటివరకు అధికారిక లెక్కల ప్రకారం 82 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు. మరో 41 మంది ఇప్పటికీ మిస్సింగ్‌గా ఉన్నారు. వరద నీటి ప్రవాహంలో గల్లంతైన వారిలో కొందరి ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. ఇది మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఇలాంటి విపత్తు సమయంలో అమెరికా ప్రభుత్వం సహాయక చర్యలపై దృష్టి సారించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు వైట్‌హౌస్ ప్రకటించింది. రాష్ట్ర, ఫెడరల్ అధికారులతో కలిసి ట్రంప్ సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.
ఈ వరదలు కేవలం జలప్రళయం మాత్రమే కాదు, మానవ నిగ్రహాన్ని, మానవ సహాయచేతుల సామర్థ్యాన్ని పరీక్షించిన ప్రమాదం. ఇది మానవ నిర్మిత మౌలిక వసతుల పరిమితుల్ని, ప్రకృతి ముందు మన బలహీనతను మరోసారి నెమరెత్తించింది.
Hyderabad : విద్యా వాగ్దానాలు వృథా…ఇంకా అద్దె భవనాల్లోనే ప్రభుత్వ పాఠశాలలు !