Policy : రూ. 20 లకే లక్ష రూపాయల పాలసీ..ఎక్కడంటే !!
Policy : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జన సురక్ష పథకాలు భద్రత లేని లక్షలాది పౌరులకు కొత్త ఆశ చూపిస్తున్నాయని పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక ఈ పథకాల ప్రయోజనాలను పొందాలని
- By Sudheer Published Date - 03:33 PM, Mon - 7 July 25

ప్రజల ఆర్థిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “జన సురక్ష” (Jansuraksha ) పథకాలు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా రూపొందించబడ్డాయి. విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఈ పథకాలపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ జీవిత బీమా సదుపాయం పొందాలని సూచించారు. ప్రధానంగా “ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన” ద్వారా కేవలం రూ.20 ప్రీమియంతో రూ.2 లక్షల బీమా పొందవచ్చునని తెలిపారు. అలాగే “ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన” ద్వారా రూ.436 ప్రీమియంతో ప్రమాదవశాత్తూ మరణం సంభవించినా రూ.2 లక్షలు లభిస్తాయని వివరించారు.
Hyderabad : విద్యా వాగ్దానాలు వృథా…ఇంకా అద్దె భవనాల్లోనే ప్రభుత్వ పాఠశాలలు !
వృద్ధాప్యంలో పౌరుల జీవితాన్ని ఆర్థికంగా మరింత భద్రముగా చేయాలనే ఉద్దేశంతో కేంద్రం “అటల్ పెన్షన్ యోజన”ను ప్రవేశపెట్టింది. 18-40 ఏళ్ల మధ్య వయసున్న వారు ఈ పథకంలో చేరితే, 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.1000 నుంచి రూ.5000 వరకు పింఛను పొందే అవకాశం ఉంటుంది. చందాదారుడు మరణించినా, వారి జీవిత భాగస్వామికి పింఛను లభిస్తుంది. ఇద్దరూ లేకపోతే, నామినీకి దాచిన మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ఇది పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
ఈ పథకాల ప్రయోజనాలను మరింతగా ప్రజలకు చేర్చే ఉద్దేశంతో, జిల్లా లీడ్ బ్యాంక్, ప్రభుత్వ శాఖల సమన్వయంతో గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జన సురక్ష పథకాలు భద్రత లేని లక్షలాది పౌరులకు కొత్త ఆశ చూపిస్తున్నాయని పేర్కొన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక ఈ పథకాల ప్రయోజనాలను పొందాలని, కనీస డిపాజిట్‌తో జన్‌ధన్ ఖాతా తెరిచి మరిన్ని కేంద్ర పథకాల లాభాలను పొందవచ్చునని సూచించారు.