Israels Isolation : ఏకాకిగా ఇజ్రాయెల్.. రఫాలో నరమేధంపై ఏకమైన ప్రపంచం
ఇజ్రాయెల్.. అంటే శక్తివంతమైన దేశం. ఆర్మీ టెక్నాలజీలో దాన్ని మించిన దేశం మరొకటి లేదని అంటారు.
- Author : Pasha
Date : 29-05-2024 - 3:12 IST
Published By : Hashtagu Telugu Desk
Israels Isolation : ఇజ్రాయెల్.. అంటే శక్తివంతమైన దేశం. ఆర్మీ టెక్నాలజీలో దాన్ని మించిన దేశం మరొకటి లేదని అంటారు. అలాంటి దేశం సొంత మిలిటరీ కూడా లేని పాలస్తీనా లాంటి ప్రాంతంతో గతేడాది అక్టోబరు 7 నుంచి ఫైట్ చేస్తూనే ఉంది. చిన్నపాటి మిలిటెంట్ సంస్థ హమాస్‌తో ఇంకా దాని పోరాటం కొనసాగుతూనే ఉంది. ఏడు నెలలు గడిచినా.. గాజాలో ఇజ్రాయెలీ బందీలను దాచిన ప్రదేశాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ గుర్తించలేకపోయింది.
We’re now on WhatsApp. Click to Join
తాజాగా దాదాపు 15 లక్షల జనాభా కలిగిన అతిచిన్న గాజా నగరం రఫాపై ఇజ్రాయెల్ ముప్పేట దాడులు చేస్తోంది. ఆకాశం నుంచి బాంబులు జార విడుస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు రఫా నగరంలోకి కూడా ప్రవేశించాయి. గత కొన్ని రోజులుగా .. ఇజ్రాయెల్ దాడుల్లో ప్రతిదినం పదుల సంఖ్యలో సామాన్య రఫా నగర ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. చనిపోతున్న వారంతా హమాస్ మిలిటెంట్లు అని ఇజ్రాయెల్ ప్రకటన విడుదల చేస్తోంది. ఈనేపథ్యంలో ప్రపంచ దేశాల నుంచి ఇజ్రాయెల్‌కు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. సామాన్య పాలస్తీనా పౌరులను చంపుతున్న ఇజ్రాయెల్ రాక్షసత్వాన్ని యావత్ ప్రపంచం ఖండిస్తోంది. దీంతో ప్రపంచ వేదికపై ఒంటరి పక్షిగా ఇజ్రాయెల్ (Israels Isolation) మిగిలిపోతోంది.
Also Read : Robot Dogs : రోబో డాగ్స్ రెడీ.. శత్రువులను కాల్చి పారేస్తాయ్
రఫాపై దాడులను ఆపేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించినా ఇజ్రాయెల్ పెడచెవిన పెట్టింది. తద్వారా అంతర్జాతీయ చట్టాలంటే తనకు లెక్కలేదనే విషయాన్ని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. అమెరికా అండ చూసుకొని గాజా ప్రాంతంలో నరమేధాన్ని ఇజ్రాయెల్ కొనసాగిస్తోంది. అమెరికాలోని విద్యార్థుల దగ్గరి నుంచి మొదలుకొని ప్రపంచ దేశాల రాజకీయ నాయకులు, సెలబ్రిటీల దాకా ప్రతి ఒక్కరు ఇజ్రాయెల్ సాగిస్తున్న నరమేధాన్ని ఏదో ఒకరకంగా ఖండిస్తూనే ఉన్నారు. నిరసనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయినా ఇజ్రాయెల్‌లో మార్పు రావడం లేదు. దీనికి సంబంధించిన నిరసనను కొందరు ఆన్‌లైన్ వేదికగా తెలియజేస్తున్నారు. వివిధ సోషల్ మీడియా సైట్లలో “ఆల్ ఐస్ ఆన్ రఫా” పేరుతో ఉన్న ఇమేజ్‌లను షేర్ చేస్తూ, రఫాలో ఇజ్రాయెల్ కాల్పుల విరమణకు అభ్యర్థిస్తున్నారు. #AllEyesOnRafah అనే హ్యాష్‌ట్యాగ్‌తో పలువురు ప్రముఖులు గాజాకు మద్దతుగా సందేశాలను షేర్ చేస్తున్నారు.