Airport: విమానాశ్రయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం.. 1350 విమానాలు రద్దు?
బ్రిటన్‌లోని లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం మార్చి 21న రోజంతా మూసివేశారు . ఇది వేలాది విమానాలను (Flights) ప్రభావితం చేసింది.
- By Gopichand Published Date - 12:08 AM, Sat - 22 March 25

Airport: బ్రిటన్‌లోని లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం మార్చి 21న రోజంతా మూసివేశారు . ఇది వేలాది విమానాలను (Flights) ప్రభావితం చేసింది. నివేదికల ప్రకారం.. 1,300 కంటే ఎక్కువ విమానాలు ప్రభావితమయ్యాయి. వాటిలో చాలా వరకు రద్దు చేశారు. కొన్ని విమానాలను దారి మళ్లించారు. ఈ సమస్య చాలా రోజుల పాటు కొనసాగుతుందని భావిస్తున్నారు.
విమానాలపై విస్తృత ప్రభావం
విమానాశ్రయం మూసివేత ప్రకటించినప్పుడు దాదాపు 120 విమానాలు హీత్రూ విమానాశ్రయం వైపు ఎగురుతున్నాయి. ఈ విమానాలు తిరిగి రావాలి లేదా వేరే విమానాశ్రయానికి మళ్లింఆరు. లండన్ సమీపంలోని గాట్విక్, పారిస్‌లోని చార్లెస్ డి గల్లె, ఐర్లాండ్‌కు అనేక విమానాలు పంపబడ్డాయి.
హఠాత్తుగా విమానాశ్రయం ఎందుకు మూతపడింది?
వాస్తవానికి హీత్రో విమానాశ్రయానికి సమీపంలో ఉన్న విద్యుత్ సబ్‌స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా గందరగోళం ఏర్పడి విమానాశ్రయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాత్రి 11 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత 10 అగ్నిమాపక యంత్రాలు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు 150 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఉదయం 8 గంటలకు మంటలు అదుపులోకి వచ్చాయి.
Also Read: SUVs In India: భారతదేశంలో ఎస్‌యూవీలు ఎందుకు అత్యధికంగా అమ్ముడవుతున్నాయి?
విమాన కార్యకలాపాలపై ప్రభావం
విద్యుత్ సరఫరా లోపం కారణంగా విమాన సర్వీసులను అకస్మాత్తుగా నిలిపివేయాల్సి వచ్చింది. ఫ్లైట్‌రాడార్ 24 ప్రకారం.. కనీసం 1,350 విమానాలు హీత్రూకి, బయటికి రాకపోకలు దెబ్బతిన్నాయి. ఈ అగ్నిప్రమాదం ప్రభావం రెండ్రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. విద్యుత్తు అంతరాయం కారణంగా ఒక లక్షకు పైగా ఇళ్లకు రాత్రిపూట విద్యుత్ సరఫరా లేదు. అయినప్పటికీ చాలా ఇళ్లకు సరఫరా పునరుద్ధరించబడింది. అయితే దాదాపు 4000 ఇళ్లలో ఇప్పటికీ విద్యుత్ సరఫరా పునరుద్ధరించబడలేదు.
ముంబై నుంచి లండన్ హీత్రూ వెళ్లే ఏఐ129 విమానం తిరిగి ముంబైకి చేరుకుందని ఎయిర్ ఇండియా తెలిపింది. ఢిల్లీ నుంచి వస్తున్న ఏఐ161 విమానాన్ని ఫ్రాంక్‌ఫర్ట్ వైపు మళ్లించారు. అదనం, ఈ ఉదయం AI111తో సహా మార్చి 21న లండన్ హీత్రూకి,బయలుదేరే అన్ని విమానాలు రద్దు చేయబడ్డాయి.