Pak New PM : ప్రధానిగా ఆయన్ను ఎన్నుకున్న పాక్ పార్లమెంట్.. రేపే ప్రమాణం
Pak New PM : పాకిస్తాన్ కొత్త ప్రధానమంత్రిగా 72 ఏళ్ల షెహబాజ్ షరీఫ్ ఎంపికయ్యారు.
- Author : Pasha
Date : 03-03-2024 - 3:37 IST
Published By : Hashtagu Telugu Desk
Pak New PM : పాకిస్తాన్ కొత్త ప్రధానమంత్రిగా 72 ఏళ్ల షెహబాజ్ షరీఫ్ ఎంపికయ్యారు. ఆదివారం పాకిస్తాన్ పార్లమెంట్‌లో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో ఆయనకు మెజారిటీ ఓట్లు వచ్చాయి. పాక్ పార్లమెంటులో మొత్తం 336 మంది సభ్యులు ఉన్నారు. అయితే పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్), పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఉమ్మడి అభ్యర్థిగా పోటీచేసిన షెహబాజ్ షరీఫ్‌కు అత్యధికంగా 201 ఓట్లు వచ్చాయి. దీంతో వరుసగా రెండోసారి దేశ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఆయనను వరించింది. మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీప్ తమ్ముడే ఈ షెహబాజ్ షరీఫ్. ఈసారి జరిగిన ఎన్నికల్లో నవాజ్ షరీఫ్ రాజకీయ పార్టీ పీఎంఎల్-ఎన్ రెండో స్థానానికి పరిమితమైంది. దీంతో పీపీపీ పార్టీతో కలిసి సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేయాల్సి వచ్చింది.ఈనేపథ్యంలో సంకీర్ణ సర్కారు ప్రధానమంత్రిగా కావడం తనకు ఇష్టం లేదని నవాజ్ షరీఫ్ ప్రకటించారు. నవాజ్ షరీఫ్ సూచన మేరకు ఆయన తమ్ముడు షెహబాజ్ ప్రధాని(Pak New PM) పదవిని చేపట్టారు.
We’re now on WhatsApp. Click to Join
పార్లమెంటులో జరిగిన ప్రధానమంత్రి ఎంపిక ప్రక్రియలో మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన ఎంపీల తరఫున ఒమర్ అయూబ్ ఖాన్ పోటీ చేశారు. అయితే ఆయనకు కేవలం 92 ఓట్లే వచ్చాయి. సోమవారం రోజు పాకిస్తాన్ రాష్ట్రపతి భవన్‌లో దేశ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకుముందు 2022 ఏప్రిల్ నుంచి 2023 ఆగస్టు వరకు సంకీర్ణ ప్రభుత్వానికి కూడా ప్రధానమంత్రిగా షెహబాజ్ పనిచేశారు.