PM Modi UAE Visit: ఫ్రాన్స్ పర్యటన ముగించుకుని యూఏఈ చేరుకున్న ప్రధాని మోదీ.. పలు అంశాలపై చర్చలు..!
ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటనను ముగించుకుని శనివారం (జూలై 15) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) (PM Modi UAE Visit) చేరుకున్నారు.
- By Gopichand Published Date - 02:05 PM, Sat - 15 July 23

PM Modi UAE Visit: ప్రధాని నరేంద్ర మోదీ తన రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటనను ముగించుకుని శనివారం (జూలై 15) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) (PM Modi UAE Visit) చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది.యూఏఈలో ప్రధాని మోదీ అధికారిక పర్యటనకు ముందు దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా భారత జాతీయ జెండా రంగులను ప్రదర్శించింది.
అబుదాబి చేరుకున్న ప్రధాని మోదీకి విమానాశ్రయంలో అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ స్వాగతం పలికారు. స్వాగతానికి కృతజ్ఞతలు తెలుపుతూ, ప్రధాని మోదీ ట్విట్టర్‌లో “ఈరోజు విమానాశ్రయంలో నన్ను స్వీకరించినందుకు క్రౌన్ ప్రిన్స్ హెచ్‌హెచ్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌కు ధన్యవాదాలు” అని పోస్ట్ చేశారు.
#WATCH प्रधानमंत्री नरेंद्र मोदी के UAE की आधिकारिक यात्रा से पहले दुबई के बुर्ज खलीफा ने कल भारतीय राष्ट्रीय ध्वज के रंग प्रदर्शित किए। pic.twitter.com/aq5AyZEkFJ
— ANI_HindiNews (@AHindinews) July 15, 2023
ప్రధాని మోదీ అబుదాబి విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ట్వీట్ చేస్తూ, “భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళుతున్నాం! ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అబుదాబి చేరుకున్నారు. హిస్ హైనెస్ షేక్ ఖలీద్ బిన్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, క్రౌన్ అబుదాబి యువరాజు విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో ప్రధాని మోదీ శనివారం (జూలై 15) విస్తృత చర్చలు జరపనున్నారు.
Grateful to Crown Prince HH Sheikh Khaled bin Mohamed bin Zayed Al Nahyan for welcoming me at the airport today. pic.twitter.com/3dM8y5tEdv
— Narendra Modi (@narendramodi) July 15, 2023
Also Read: IPL 2024: 2024 టార్గెట్ గా లక్నో సంచలన నిర్ణయం…మార్పు తప్పలేదు
రెండు దేశాల మధ్య ఇంధనం, ఆహార భద్రత, రక్షణ వంటి అంశాలపై చర్చలు జరగొచ్చు. వ్యూహాత్మక భాగస్వాములుగా చారిత్రక వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసిన తర్వాత ఇరు దేశాలు పురోగతిని సమీక్షించనున్నాయి. దీంతో పాటు జీ20 ఎజెండాపై కూడా చర్చలు జరగనున్నాయి. ప్రధాని అయిన తర్వాత నరేంద్ర మోదీ యూఏఈలో పర్యటించడం ఇది 5వసారి. ప్రధాని నరేంద్ర మోదీ అంతకుముందు ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. ఫ్రాన్స్ పర్యటన చిరస్మరణీయమని ప్రధాని మోదీ అభివర్ణించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఫ్రాన్స్ ప్రజలకు పీఎం మోదీ ధన్యవాదాలు తెలిపారు.