Imran Khan : ఇమ్రాన్ ఖాన్‌తో జైలులో ప్రధాని, ఆర్మీ చీఫ్ భేటీ.. డీల్ ఫిక్స్ ?
ఈ డీల్‌కు అంగీకరించినందుకు ప్రతిఫలంగా త్వరలోనే ఇమ్రాన్ ఖాన్(Imran Khan)కు బెయిల్ దొరికేలా పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుందట.
- By Pasha Published Date - 08:48 PM, Sat - 3 May 25

Imran Khan : జమ్మూకశ్మీరులోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది. భారత్ ఏ క్షణం దాడి చేస్తుందోననే భయం పాక్‌ను వెంటాడుతోంది. మరోవైపు జైలులో ఉన్న మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కూడా అక్కడి సర్కారుకు తలనొప్పిగా మారారు. ఆయన మద్దతుదారులు సింధ్ ప్రావిన్స్ పరిధిలో పెద్దఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని, ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే బెలూచిస్తాన్ ప్రాంతంలో మిలిటెంట్లు పాకిస్తాన్ ఆర్మీకి దడ పుట్టిస్తున్నారు. దీంతో అక్కడి నుంచి ఆర్మీని కదిపే పరిస్థితి లేకుండా పోయింది. ఆఫ్ఘనిస్తాన్ బార్డర్‌లో తాలిబన్ అనుకూల మిలిటెంట్లు రెచ్చిపోతున్నారు. ఫలితంగా అక్కడి నుంచి కూడా మిలిటరీని విరమించుకునే ఛాన్స్ లేదు. ఇంకోవైపు ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల భారీ నిరసనలతో సింధ్ ప్రావిన్స్‌లోనూ భారీగా పాక్ ఆర్మీని మోహరించారు.
Also Read :Congress : హాట్ కేకుల్లా డీసీసీ అధ్యక్ష పోస్టులు.. కాంగ్రెస్‌లో ‘సంస్థాగత’ సందడి
పాకిస్తాన్‌కు సైనికుల కొరత
ఇప్పుడు భారత్‌తో యుద్ధ పరిస్థితులు నెలకొన్నందున భారత బార్డర్‌కు తరలించేందుకు పాకిస్తాన్‌కు సైనికుల కొరత ఏర్పడింది. సింధ్ ప్రావిన్స్‌లో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు శాంతిస్తే.. అక్కడి నుంచి సైన్యాన్ని భారత బార్డర్‌కు పంపాలని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ భావిస్తున్నారు. ఇందుకోసం అవసరమైతే ఇమ్రాన్ ఖాన్‌తో డీల్ కుదుర్చుకోవడానికి కూడా ఆయన రెడీ అయ్యారు. ఈక్రమంలోనే ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, ప్రధాని షెహబాజ్ షరీఫ్ కలిసి జైలుకు వెళ్లి మరీ ఇమ్రాన్ ఖాన్‌తో భేటీ అయినట్లు తెలుస్తోంది. సింధ్ ప్రావిన్స్‌లో నిరసనలు ఆపేలా మద్దతుదారులకు పిలుపునివ్వాలని ఇమ్రాన్‌కు వారు రిక్వెస్టు చేశారని సమాచారం. ఇందుకు అనుకూలంగా ఇమ్రాన్ స్పందించినట్లు తెలిసింది.
Also Read :MLAs Progress Report: సీఎం రేవంత్ చేతిలో ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్.. వాట్స్ నెక్ట్స్ ?
త్వరలోనే ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ ?
ఈ డీల్‌కు అంగీకరించినందుకు ప్రతిఫలంగా త్వరలోనే ఇమ్రాన్ ఖాన్(Imran Khan)కు బెయిల్ దొరికేలా పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుందట. ఇమ్రాన్ ఖాన్ బయటికి వచ్చాక పాకిస్తాన్ రాజకీయాలు మరో కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు భారత్‌కు అనుకూలంగా ఆయన మాట్లాడారు. భారత్‌ను చూసి, భారత నాయకత్వాన్ని చూసి నేర్చుకోవాలని పాకిస్తాన్ నేతలకు ఇమ్రాన్ ఖాన్ హితవు పలికారు. కాలం కలిసొస్తే.. రాబోయే ఐదేళ్లలో మరోసారి పాకిస్తాన్ రాజకీయాల్లో కింగ్ మేకర్‌గా ఇమ్రాన్ ఖాన్ అవతరించే అవకాశం ఉందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.