HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Opposition Has Begun In Pakistan

పాక్ లో వ్యతిరేకత మొదలయింది.

  • Author : Vamsi Chowdary Korata Date : 04-04-2026 - 1:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pakistan Crisis
Pakistan Crisis

Pakistan Crisis  పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంధన సమస్యను అధిగమించేందుకు దాయాది పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో షెహబాజ్ షరీఫ్ సర్కారు వెంటనే లీటర్ పెట్రోల్‌పై ధరలను తగ్గించింది. గురువారం ఇంధన ధరలు పెంచగా.. 24 గంటల్లోనే దానిని సమీక్షించింది. దీంతో ధరలు కాస్త తగ్గించడంతో సామాన్యులకు కొంత మేర ఉపశమనం కలిగే అవకాశం ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత నుంచి పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది.

పశ్చిమాసియా యుద్ధం ప్రపంచ మొత్తాన్ని ఇంధన సంక్షోభంలోకి నెట్టేస్తోంది. దాంతో పలు దేశాలను చమురు కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్, ఎల్పీజీ ధరలను భారీగా పెంచేస్తుండటంతో సామాన్యులపై మరింత భారం పడుతోంది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దాయాది పాకిస్థాన్‌.. చమురు ధరలు పెంచడంతో ప్రజాగ్రహాన్ని ఎదుర్కొంటోంది. విమర్శలు, వ్యతిరేకత వ్యక్తకావడంతో పాకిస్థాన్ ప్రభుత్వం ధరల తగ్గింపుపై కీలక నిర్ణయం తీసుకుంది. షెహబాజ్ షరీఫ్ నాయకత్వంలోని ప్రభుత్వం రాత్రికి రాత్రే లీటర్‌ పెట్రోల్‌పై 80 పాకిస్థానీ రూపాయలు తగ్గించింది.

గురువారమే పాక్ సర్కారు పెట్రోల్‌పై 43 శాతం, హైస్పీడ్ డీజిల్ (HSD)పై 55 శాతం ధరలను పెంచింది. ఈ పెంపుతో పెట్రోల్‌ లీటరు 458 పాకిస్థానీ రూపాయలకు, డీజిల్ 520 పీకేఆర్‌కు చేరింది. ఇది ప్రజాగ్రహానికి దారితీసింది. పాక్ ప్రభుత్వంపై సామాన్యులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ శుక్రవారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఇంధన ధరల తగ్గింపు గురించి మాట్లాడుతూ.. పెట్రోల్‌పై 80 రూపాయలు తగ్గిస్తున్నామని, దాంతో లీటర్ 378 పీకేఆర్‌లకే లభిస్తుందని చెప్పారు.

కనీసం నెల రోజుల పాటు ఈ ధరలో ఎటువంటి మార్పు ఉండబోదని ఆయన హామీ ఇచ్చారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులే పెట్రోల్ ధరల పెరుగుదలకు కారణమని ఆయన అంగీకరించారు. కానీ, ధరలను నియంత్రించేందుకు తమ ప్రభుత్వం అన్నిరకాల చర్యలు చేపడుతోందని చెప్పారు. హెచ్‌ఎస్‌డీ డీజిల్‌పై కూడా లెవీని తొలగించింది. ఇరాన్‌పై అమెరికా- ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించిన నాలుగు రోజులకే పాకిస్థాన్ పెట్రోల్, డీజిల్ ధరలను 20 శాతం మేర పెంచింది. గురువారం దాన్ని రెట్టింపు చేసి ప్రజలపై మరింత భారం వేసింది.

ఇక, దేశంలో ఇంధన పొదుపునకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆఫీసు పనిదినాలను వారానికి నాలుగు రోజులకు కుదించింది. విద్యా సంస్థలకు సెలవులు పొడిగించడమే కాకుండా ఆన్‌లైన్ తరగతులకు కూడా మార్చారు. అధిక పేదరికం ఉన్న పాకిస్థాన్ వంటి దేశాలకు ధరల పెరుగుదల ఆహార సంక్షోభానికి దారితీస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన పాకిస్థాన్.. ఐఎంఎఫ్ నుంచి భారీగా రుణాలను తీసుకుంది. ఇందుకోసం ఆ సంస్థ విధించే షరతులకు తలొగ్గాల్సిన పరిస్థితి ఎదురయ్యింది. ఇంధన ధరల పెంపు, పన్నుల భారం వంటి నిర్ణయాలను అమలు చేయాల్సిందేనని ఐఎంఎఫ్ ఖరాఖండిగా చెప్పడంతో పాక్‌కు మరో గత్యంతరం లేకుండా పోయింది.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Israel-US-Iran War
  • Pakistan Crisis
  • Pakistan Petrol Prices
  • Petrol Prices
  • Shebaz Sharif

Related News

Petrol and diesel prices rise again.

Fuel Price Hike: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరగడంతో.. దేశంలో ఇంధన ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గ్లోబల్ మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా ఇటీవలే లీటర్ పెట్రోల్‌, డీజిల్‌పై ఏకంగా రూ.3 పెంచిన సంగతి తెలిసిందే. ఆ భారం మరువక ముందే ఇప్పుడు మళ్లీ రేట్లు పెరిగాయి. తాజా సవరణ ప్రకారం.. దేశవ్యాప్తంగా సగటున లీటర్‌

  • Fuel Price Hike

    Petrol Prices Hike: వాహనదారులకు షాక్..పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Latest News

  • Skoda : స్కోడా ఆటో ఇండియా ప్రచారం

  • kingFisher Beer : బీర్ బాటిల్‌లో అపరిశుభ్ర వస్తువు? క్లారిటీ ఇచ్చిన కింగ్‌ఫిషర్ యాజమాన్యం!

  • Eco-Friendly : ‘సమ్మర్ కాటన్ కలెక్షన్’ను విడుదల చేసిన మిస్సమ్మ!

  • CBN In Kuppam: రోడ్డు పక్కన ఆగి తాటి ముంజలు తిన్న సీఎం చంద్రబాబు దంపతుల

  • Jr NTR లూగర్ పేరు వెనుక ఉన్న రహస్యం ఇదేనా..!

Trending News

    • Silver Chappal: అల్లుడికి అత్తింటివారు కిలోన్నర వెండి చెప్పులు

    • Beer Price Drop: మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్..రూ.185 బీర్ ధర రూ.110 కి..70 రూ .ల తగ్గింపు

    • Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్‌ గాంధీ

    • UAE: భారత్‌తో యూఏఈ కీలక ఒప్పందాలు.. ఇంధన రంగంలో భారీ డీల్స్‌

    • Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd