HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Operation Sindoor Effect Formation Of Pakistan Rocket Force

Pakistan : ఆపరేషన్‌ సిందూర్‌ ఎఫ్‌క్ట్‌..పాకిస్థాన్‌ రాకెట్‌ ఫోర్స్‌ ఏర్పాటు

ఈ రాకెట్‌ ఫోర్స్‌ ద్వారా దేశ సైనిక శక్తిని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ దళాన్ని తయారు చేస్తామని, భవిష్యత్తు యుద్ధాల్లో కీలకంగా మారనున్న మిస్సైల్‌ మోహరింపులకు ఇది అనువుగా ఉంటుందని వివరించారు. ఈ రాకెట్‌ ఫోర్స్‌కు ప్రత్యేక కమాండ్‌ వ్యవస్థ ఉండనుంది.

  • By Latha Suma Published Date - 03:07 PM, Thu - 14 August 25
  • daily-hunt
Operation Sindoor Effect.. Formation of Pakistan Rocket Force
Operation Sindoor Effect.. Formation of Pakistan Rocket Force

Pakistan : ఆపరేషన్‌ సిందూర్‌లో భారత్‌ ప్రయోగించిన క్షిపణుల దెబ్బకు తలతిరిగిన పాకిస్థాన్‌ (Pakistan), ఇప్పుడు తన రక్షణ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించేందుకు కొత్త పావులు కదుపుతోంది. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి ఒక కీలక ప్రకటనతో దేశ ప్రజల ముందుకొచ్చిన పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, “పాక్‌ రాకెట్‌ ఫోర్స్‌” అనే ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రాకెట్‌ ఫోర్స్‌ ద్వారా దేశ సైనిక శక్తిని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ దళాన్ని తయారు చేస్తామని, భవిష్యత్తు యుద్ధాల్లో కీలకంగా మారనున్న మిస్సైల్‌ మోహరింపులకు ఇది అనువుగా ఉంటుందని వివరించారు. ఈ రాకెట్‌ ఫోర్స్‌కు ప్రత్యేక కమాండ్‌ వ్యవస్థ ఉండనుంది. సంప్రదాయ యుద్ధాల సమయంలో, ముఖ్యంగా క్షిపణుల దాడులు, శత్రుదేశపు మౌలిక సదుపాయాలపై స్ట్రాటజిక్‌ దాడుల నిర్వహణలో ఇది ప్రధాన పాత్ర పోషించనుంది. అంతేకాదు, ఈ ఫోర్స్‌ ఏర్పాటు పూర్తిగా భారత్‌ దృష్టిలో పెట్టుకుని జరుగుతోందని ఒక ఉన్నతాధికారి ఓ విదేశీ మీడియాకు వెల్లడించాడన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి.

భారత్‌పై పాక్‌ వరుస బెదిరింపులు

ఈ ప్రకటనకు ముందే, మంగళవారం పాక్‌ ప్రధాని షరీఫ్‌ న్యూదిల్లీకి కాస్త ఘాటుగా హెచ్చరికలు జారీ చేశారు. సింధూ జలాలపై భారత చర్యలను ఉద్దేశించి ఒక్క చుక్క నీరు కూడా తీసుకొన్నా సహించేది లేదు అంటూ వ్యాఖ్యానించారు. సింధు నదీ జలాలు తమ దేశానికి ప్రాణాధారమని, వాటిపై ఎలాంటి రాజీకి అవకాశం లేదని అన్నారు. భారత్‌కు “మరిచిపోలేని గుణపాఠం” చెబుతామంటూ ప్రేలాపనకు దిగారు.

రాజకీయ నేతల నుండి ఆర్మీ వరకూ అదే శబ్దం

పాక్‌లో ఉన్నత స్థాయి నేతలు, రాజకీయ నాయకులు, సైనికాధికారులంతా భారత్‌పై విమర్శలదండిగా మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టారు. పీపీపీ నేత బిలావల్‌ భుట్టో మోదీ వ్యతిరేకంగా పాక్‌ ప్రజలను ఏకం కావాలని పిలుపునిచ్చారు. మరోవైపు, ఆర్మీ చీఫ్‌ అసీం మునీర్‌ అమెరికాలో మాట్లాడుతూ, పాక్‌ను తక్కువ అంచనా వేయకూడదని, ప్రమాదం కలగవచ్చని ఓ మారుపరిచయంతో హెచ్చరించారు. భారత్‌ ఓ మెర్సిడెస్‌ కారు అయితే, పాకిస్థాన్‌ ఓ డంప్‌ ట్రక్కు. కారు వచ్చి లారీని ఢీకొంటే ఎవరి నష్టం ఎక్కువ? అని ఆయన చేసిన వ్యాఖ్యలు, జాతీయ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అంతేకాదు, భారత్‌ సింధూ నదిపై డ్యామ్‌ నిర్మిస్తే, మిస్సైళ్లతో పేల్చివేస్తామని ఆయన తేల్చి చెప్పారు.

అమెరికా మద్దతుతో అణు బెదిరింపులు?

పాకిస్థాన్‌ నేతలు భారత్‌పై చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా కూడా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ప్రత్యేకించి అమెరికా వేదికగా మునీర్‌ చేసిన అణు బెదిరింపులు, పాకిస్థాన్‌ ఆత్మరక్షణ పేరుతో, పొరుగుదేశాల భద్రతను ప్రమాదంలోకి నెట్టేలా ఉన్నాయి. భారత్‌ భద్రతను దృష్టిలో ఉంచుకుని రాకెట్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేయడమే కాకుండా, పాకిస్థాన్‌ ప్రస్తుతం ఉగ్రవాదంపై కాకుండా భారతంపై తన శక్తిని కేంద్రీకరిస్తోంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా భారత్‌ నుంచి ఎదురైన క్షిపణి దాడులు, రక్షణ పరంగా చేసిన ముందడుగులు ఇప్పుడు పాకిస్థాన్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేశాయని స్పష్టమవుతోంది. అయితే పాక్‌ కొత్తగా ఏర్పాటు చేస్తున్న రాకెట్‌ ఫోర్స్‌ నిజంగా వారి రక్షణ శక్తిని పెంచుతుందా? లేక జాతీయవాదాన్ని రెచ్చగొట్టేందుకు గాలికొదిలిన ప్రకటనల పరంపరేనా? అనేది కాలమే తేల్చాలి.

Read Also: Pulivendula : ఎన్నికల కౌంటింగ్‌లో ఆసక్తికర ఘటన..30 ఏళ్ల తర్వాత ఓటేశా బ్యాలెట్‌ బాక్స్‌లో ఓటరు మెసేజ్‌..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Cutting-edge technology
  • india
  • Operation Sindoor Effect
  • Pakistan Prime Minister Shehbaz Sharif
  • Pakistan Rocket Force

Related News

Ex Soldier India

Finance : మాజీ సైనికోద్యోగుల పిల్లల పెళ్లికి రూ.లక్ష

Finance : దేశ సేవలో జీవితాన్ని అర్పించిన మాజీ సైనికులు, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గొప్ప బహుమతి ప్రకటించింది. రక్షణ శాఖ తాజాగా పెన్షన్ అర్హత లేని మాజీ సైనికోద్యోగులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని 100 శాతం పెంచే ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది

  • 'relife' And 'respifresh Tr

    Cough syrup : ఈ మూడు దగ్గు సిరప్లు డేంజర్ – WHO

Latest News

  • CM Chandrababu: లండన్‌ పర్యటనకు సీఎం చంద్రబాబు.. ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేశ్!

  • Kiran Navgire: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా క్రికెట‌ర్‌!

  • Garib-Rath Train: త‌ప్పిన పెను ప్ర‌మాదం.. రైలులో అగ్నిప్ర‌మాదం!

  • Afghanistan-Pakistan War: విషాదం.. ముగ్గురు క్రికెట‌ర్లు దుర్మ‌ర‌ణం!

  • Pawan Kalyan Next Film : పవన్-లోకేశ్ కాంబోలో సినిమా?

Trending News

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd