240 Trash Balloons: దక్షిణ కొరియాకు ‘కిమ్’ మళ్లీ చెత్త బెలూన్లు
దక్షిణ కొరియాకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మళ్లీ చెత్త బెలూన్లను పంపాడు. త్తతో నింపిన దాదాపు 240 బెలూన్లను దక్షిణ కొరియాకు చేరినట్లు అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు ఉత్తర కొరియా నుండి చెత్తతో నిండిన మొత్తం 11 సార్లు బెలూన్‌లను పంపారు
- By Praveen Aluthuru Published Date - 09:59 AM, Sun - 11 August 24

240 Trash Balloons: ఉత్తర కొరియాకు దక్షిణ కొరియాకు మధ్య చెత్త బెలూన్ల వార్ నడుస్తుంది. ఇరు దేశాల మధ్య గత కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తర కొరియా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. తాజాగా దక్షిణ కొరియాకు చెత్తతో నిండిన బెలూన్లను చేరవేసి మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ఆ బెలూన్లలో ఎటువంటి ప్రమాదకర పదార్దాలు లేకపోవడం గమనార్హం. ఇది కేవలం రెచ్చగొట్టే చర్యల్లో భాగమేనని అంటున్నారు.
ఉత్తర కొరియా మరోసారి చెత్తతో నింపిన బెలూన్లను దక్షిణ కొరియాకు పంపింది. ఈ రోజు ఆదివారం దాదాపు 240 బెలూన్లను చెత్తతో నింపిన బెలూన్లను దక్షిణ కొరియాకు పంపినట్లు అధికారులు తెలిపారు. వీటిలో 10 దక్షిణ ప్రాంతంలోకి వచ్చాయి. దీనికి సంబంధించి యోన్‌హాప్ వార్తా సంస్థ సదరు బెలూన్‌లను ఉత్తర కొరియా శనివారం పంపిందని నివేదించింది.
ఉదయం 10 గంటల వరకు గాలిలో బెలూన్ ఎగరడం కనిపించలేదు.ఈ బెలూన్‌లలో కొన్ని సియోల్‌కు ఆనుకుని ఉన్న సియోల్‌కు ఉత్తరాన ఉన్న జియోంగ్గీలో ల్యాండ్ అయ్యాయి.ఉత్తర కొరియా బెలూన్‌లకు సంబంధించి రెండు నివేదికలు అందాయని గ్యోంగ్గీ బుక్బు ప్రావిన్షియల్ పోలీస్ ఏజెన్సీ తెల్లవారుజామున తెలిపింది. బెలూన్లలో పేపర్ ముక్కలు, ప్లాస్టిక్ బాటిళ్లు ఉన్నాయని, అందులో ఎలాంటి ప్రమాదకర పదార్థాలు లేవని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు.
ఉత్తర కొరియా రెండు వారాల విరామం తర్వాత శనివారం తన చెత్తతో నిండిన బెలూన్ ప్రచారాన్ని తిరిగి ప్రారంభించింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు ఉత్తర కొరియా నుండి చెత్తతో నిండిన మొత్తం 11 సార్లు బెలూన్‌లను పంపారు.జూలైలో ఉత్తర కొరియా ప్రయోగించిన కొన్ని బెలూన్లు సియోల్‌లోని దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయ సముదాయంపై పడ్డాయి. ఉత్తర కొరియా మే 28 నుండి 3,600 చెత్తతో నిండిన బెలూన్‌లను విడుదల చేసిందని అధికారులు తెలిపారు.
ఉత్తర కొరియా చెత్తతో నిండిన బెలూన్ ప్రచారానికి ప్రతిస్పందనగా దక్షిణ కొరియా జూలై మధ్య నుండి తన సరిహద్దు లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రతిరోజూ భారీ వ్యతిరేక ప్రచారాన్ని ప్రసారం చేస్తోంది.
Also Read: Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాలో భారీ మార్పులు..?