HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Netanyahu Irgc World News Pmo Statement Benjamin Netanyahu

ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పారిపోయారా?

ఈ వార్తలపై నెతన్యాహు కార్యాలయం స్పష్టమైన సమాధానం ఇచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న మరణ వార్తలపై అనాడోలు ఏజెన్సీ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ప్రధాని కార్యాలయం ఇలా స్పందించింది.

  • Author : Gopi Date : 15-03-2026 - 2:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Netanyahu
Netanyahu

Netanyahu: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న తరుణంలో బెంజమిన్ నెతన్యాహు మరణించారంటూ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఒక ఘాటు ప్రకటన విడుదల చేసింది. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో IRGC ఇలా పేర్కొంది. “ఆ నేరగాడైన ప్రధానమంత్రి ఒకవేళ ఇంకా బ్రతికే ఉంటే మేము పూర్తి శక్తితో అతడిని వెంబడించి మరీ హతమారుస్తాం” అని లేఖ విడుద‌ల చేసింది. వారు నెతన్యాహును ‘పిల్లల హంతకుడు’గా అభివర్ణించారు. నెతన్యాహు చనిపోయారా లేదా తన కుటుంబంతో కలిసి పారిపోయారా అనే అనిశ్చితి ఇజ్రాయెల్ సమాజంలో తీవ్రమైన ఆందోళనను కలిగిస్తోందని IRGC పేర్కొంది.

ఇరాన్ దాడుల్లో నెతన్యాహు మరణించారని సోషల్ మీడియాలో చాలా మంది యూజర్లు వాదిస్తున్నారు. ఆయన గత కొన్ని రోజులుగా బహిరంగంగా ఎక్కడా కనిపించలేదని, ముఖ్యమైన భద్రతా సమావేశాలకు కూడా హాజరు కాలేదని వారు గుర్తు చేస్తున్నారు.

Also Read: Telangana : తెలంగాణలో వంటగ్యాస్ కొరత పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత

AI వీడియో వివాదం.. పుకార్లకు బలం

శుక్రవారం నాడు నెతన్యాహు తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధానికి సంబంధించిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో నెతన్యాహు కుడి చేతికి ఆరు వేళ్లు కనిపిస్తున్నాయని, ఇది ‘క్లాసిక్ AI ఫింగర్ గ్లిచ్’ (AI పొరపాటు) అని కొందరు యూజర్లు పేర్కొన్నారు. వీడియోలోని 0:35 సెకన్ల వద్ద ఆయన చేయి పైకి ఎత్తినప్పుడు, చిటికెన వేలు పక్కన అదనపు మాంసం ముక్కలాంటిది కనిపించింది. దీనిని చాలా మంది ఆరో వేలిగా భావించారు. దీంతో ఈ వీడియో AI ద్వారా సృష్టించబడిందని, అసలు నెతన్యాహు బ్రతికి లేరని పుకార్లు షికారు చేశాయి.

నెతన్యాహు క్షేమం.. ప్రధాని కార్యాలయం స్పష్టత

ఈ వార్తలపై నెతన్యాహు కార్యాలయం స్పష్టమైన సమాధానం ఇచ్చింది. సోషల్ మీడియాలో వస్తున్న మరణ వార్తలపై అనాడోలు ఏజెన్సీ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ప్రధాని కార్యాలయం ఇలా స్పందించింది. “ఇవన్నీ ఫేక్ న్యూస్, ప్రధానమంత్రి పూర్తి ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారు” అని తెలిపారు. విశ్వసనీయ వర్గాలు, ఫ్యాక్ట్-చెకర్లు కూడా నెతన్యాహు మరణ వార్తలు పూర్తిగా అబద్ధమని ధృవీకరించారు. ఆరు వేళ్ల వివాదం కేవలం కెమెరా యాంగిల్, దృశ్య భ్రమ కారణంగానే జరిగిందని, అది AI పొరపాటు కాదని తేల్చి చెప్పారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Benjamin Netanyahu
  • IRGC
  • netanyahu
  • PMO Statement
  • world news

Related News

    Latest News

    • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

    • Rajinikanth: స్టాలిన్‌తో రజనీకాంత్ భేటీ.. క్లిష్ట సమయంలో అండగా ఉంటానని హామీ ఇచ్చిన రజనీ

    • TVK VIJAY: విజయ్‌ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్‌

    • Papikondalu: పాపికొండలు విహార యాత్ర తాత్కాలిక నిలిపివేత

    • Hyderabad CP Sumathi: అర్ధరాత్రి నడి రోడ్డుపై మహిళా పోలీస్ కమిషనర్ కు వేధింపులు.. 40 మంది పోకిరీలకు దిమ్మతిరిగే షాక్!

    Trending News

      • AIADMK: తమిళ్ పాలిటిక్స్‎లో బిగ్ ట్విస్ట్.. అన్నాడీఎంకే లో రగడ

      • TVK Vijay Trisha: ఎమ్మెల్యేగా త్రిష అక్కడ నుంచే పోటీ..?

      • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd