HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Netanyahu Cornered The Bondi Beach Attack

బాండీ బీచ్ దాడి.. వారికి ఆస్ట్రేలియా ప్రధాని క్షమాపణలు!

ఈ ఘటన నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్వేషపూరిత ప్రసంగాలు చేసేవారిపై క్రిమినల్ చర్యలు తీసుకోనున్నారు. బహిరంగ ప్రదేశాల్లో నాజీ సెల్యూట్ చేయడాన్ని నిషేధించనున్నారు.

  • Author : Gopichand Date : 22-12-2025 - 9:39 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Bondi Beach
Bondi Beach

Bondi Beach: ఆస్ట్రేలియాలోని ప్రసిద్ధ బాండీ బీచ్‌లో జరిగిన కాల్పుల ఘటనపై ఆ దేశ ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటనకు బాధ్యత వహిస్తూ ఆయన యూదు సమాజానికి బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఉగ్రవాద శక్తులు ఆస్ట్రేలియా సమాజాన్ని విభజించడాన్ని తన ప్రభుత్వం ఎప్పటికీ అనుమతించబోదని ఆయన స్పష్టం చేశారు.

అసలేం జరిగింది?

డిసెంబర్ 14న బాండీ బీచ్‌లో హనుక్కా పండుగను జరుపుకుంటున్న యూదు సమాజంపై తండ్రీకొడుకులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోగా, అనేకమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి ఆస్ట్రేలియా వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది.

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆరోపణలు

ఈ దాడి తర్వాత ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెన్జమిన్ నెతన్యాహు ఆస్ట్రేలియా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. “ఆస్ట్రేలియా ప్రభుత్వం పాలస్తీనాను దేశంగా గుర్తించి ఉగ్రవాదానికి బహుమతి ఇచ్చింది. ఆ బలహీనతే ఈ దాడికి కారణమైంది” అని నెతన్యాహు వ్యాఖ్యానించారు. సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా పాలస్తీనాను దేశంగా గుర్తించిన సంగతి తెలిసిందే.

Also Read: సరికొత్త అవతారంలో ‘రెనో డస్టర్’.. 2026 రిపబ్లిక్ డే రోజున గ్రాండ్ ఎంట్రీ!

ప్రధాని అల్బనీస్ ఘాటు సమాధానం

సోమవారం (డిసెంబర్ 22, 2025) విలేకరులతో మాట్లాడిన అల్బనీస్.. నెతన్యాహు ఆరోపణలను తోసిపుచ్చారు. పాలస్తీనాను గుర్తించడానికి, బాండీ బీచ్ దాడికి ఎటువంటి సంబంధం లేదు. ఈ దాడి వెనుక ISIS సిద్ధాంతం ఉంది. ఇది ఇస్లాం యొక్క వికృత రూపం అని ఆయన స్పష్టం చేశారు. నేరస్తులకు ఏ దేశ గుర్తింపుతోనూ పనిలేదు. వారు కేవలం ఖలీఫా రాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది యూదు వ్యతిరేక భావజాలంతో చేసిన దాడి అని స్పష్టమవుతోంది అని ప్రధాని పేర్కొన్నారు.

ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలు

ఈ ఘటన నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్వేషపూరిత ప్రసంగాలు చేసేవారిపై క్రిమినల్ చర్యలు తీసుకోనున్నారు. బహిరంగ ప్రదేశాల్లో నాజీ సెల్యూట్ చేయడాన్ని నిషేధించనున్నారు. యూదు ప్రార్థనా స్థలాలు, కమ్యూనిటీ సెంటర్ల వద్ద భద్రత కోసం నిధులను పెంచుతున్నట్లు ప్రకటించారు. దేశంలో గన్ లైసెన్సింగ్ నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నారు. ఉగ్రవాదం పట్ల ఆస్ట్రేలియా ఎప్పటికీ రాజీపడదని, ప్రజల మధ్య ఐక్యతను కాపాడటానికి శాయశక్తులా కృషి చేస్తామని అల్బనీస్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • australia
  • Bondi beach
  • ISIS
  • Israel.
  • pakistan
  • Palestine
  • Sydney

Related News

US strikes on ISIS: A strong warning against terrorism

ఐసిస్‌పై అమెరికా మెరుపు దాడులు: ఉగ్రవాదానికి గట్టి హెచ్చరిక

‘ఆపరేషన్ హాకీ స్ట్రైక్’ పేరుతో నిర్వహించిన ఈ చర్యల్లో భాగంగా సిరియాలోని పలు ఐసిస్ శిబిరాలపై బాంబుల వర్షం కురిసినట్లు వెల్లడించింది. ఉగ్రవాద సంస్థల పునర్వ్యవస్థీకరణకు అడ్డుకట్ట వేయడం భవిష్యత్తు దాడులను నిరోధించడమే ఈ ఆపరేషన్ ప్రధాన లక్ష్యమని అమెరికా సైనిక వర్గాలు తెలిపాయి.

    Latest News

    • చలానా పడితే ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అయ్యే విధానం రావాలి: సీఎం రేవంత్ రెడ్డి

    • మారుతి కస్టమర్లకు కొత్త సౌకర్యం..ఐఓసీఎల్ పెట్రోల్ బంకుల్లో కార్ల సర్వీస్ కేంద్రాలు

    • ట్రంప్–మోదీల మధ్య విభేదాలు కూడా అలాంటివే : అమెరికా రాయబారి

    • చలికాలంలో ఆర్థరైటిస్ ఎందుకు పెరుగుతుంది?..సహజ ఆహారాలతో ఉపశమనం ఎలా పొందాలి?

    • భోగి పళ్ళు అంటే ఏమిటి?..పిల్లలకు భోగి పండ్లు ఎందుకు పోస్తారు.?

    Trending News

      • ప్ర‌యాణికుల కోసం రైల్వే శాఖ కీల‌క నిర్ణ‌యం..!

      • విరాట్ కోహ్లీకి గ‌ర్వం ఉందా? ర‌హానే స‌మాధానం ఇదే!

      • 60,000 ఏళ్ల క్రితం నాటి బాణాలు ల‌భ్యం!

      • బంగ్లాదేశ్‌కు భారీ షాక్ ఇచ్చిన బీసీసీఐ!

      • కరూర్‌ తొక్కిసలాట ఘటన..సీబీఐ ఎదుట హాజరైన టీవీకే విజయ్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd