Mysterious UFO : అమెరికాలో యూఎఫ్ఓల కలకలం.. ఏలియన్లు దిగి వచ్చాయా ?
దీనిపై అధికారులు విచారణ చేస్తున్నారని న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ(Mysterious UFO) వెల్లడించారు.
- By Pasha Published Date - 03:18 PM, Sun - 8 December 24

Mysterious UFO : అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఉన్న పలు ప్రాంతాల్లో కలకలం రేగింది. అన్ ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్ (యూఎఫ్ఓ) సంచరించడంతో జనం భయాందోళనకు లోనయ్యారు. ఇవాళ తెల్లవారుజామున గగన తలంలో పలుచోట్ల యూఎఫ్ఓలు సంచరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పలు వీడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. భవనాల పైనుంచి యూఎఫ్ఓలు వెళ్తున్నట్లు వాటిలో సీన్లు ఉన్నాయి. అవి ఏలియన్ల వాహనాలు అని కొందరు నెటిజన్లు కామెంట్స్ పెడుతుండగా.. అవి ఆర్మీ డ్రోన్లు లేదా హెలికాప్టర్లు అయి ఉండొచ్చని ఇంకొందరు నెటిజన్లు అంటున్నారు. మొత్తానికి అవి ఏమిటి ? అనే దానిపై ఇంకా పూర్తి క్లారిటీ రాలేదు. దీనిపై అధికారులు విచారణ చేస్తున్నారని న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ(Mysterious UFO) వెల్లడించారు. ప్రజల ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని స్పష్టం చేశారు.
Spotted in New Jersey 👽🛸 LFG pic.twitter.com/vjXsBNFLsw
— Joe Rogan Podcast (@joeroganhq) December 8, 2024
Also Read :Vijaysai Vs Buddha : సీఎం చంద్రబాబుపై కామెంట్స్.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై కేసు!
గత నెలలో కూడా న్యూజెర్సీలోని దాదాపు 12 ప్రాంతాల్లో ఈ తరహా ఎగిరే పల్లేలను తాము చూశామని కొందరు ప్రజలు చెబుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల టైంలో డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన భవనాల సమీపంలో కూడా ఇలాంటి డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. అప్పట్లో స్థానికులు ఈవిషయాన్ని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ విభాగాన్ని తెలియజేశారు. దీనిపై స్పందించిన ఏవియేషన్ విభాగం.. ‘‘ఆ ప్రాంతంలో డ్రోన్ల కార్యకలాపాలపై నిషేధం విధించాం. ఏ వస్తువు కూడా అక్కడ ఎగరనే లేదు’’ అని వెల్లడించింది. మరి అక్కడ ప్రజలు చూసిన ఎగిరే పల్లెం ఏమిటి ? అనేది ఇప్పటికీ పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. గతంలో ఇదే తరహాలో పలు వీడియోలు వైరల్ అయ్యాయి. ఇంతకుముందు పలుమార్లు ఈ తరహా ఫేక్ వీడియోలు ప్రచారంలోకి వచ్చాయి. అమెరికన్లకు ఈ తరహా యూఎఫ్ఓలు అంటే మొదటి నుంచీ పెద్ద భయం.వీటికి సంబంధించి అమెరికాలో విచిత్రమైన థియరీలు ప్రచారంలో ఉన్నాయి.