HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Massive Explosions In The Us Capital

అమెరికా రాజధానిలో భారీ పేలుళ్లు..

  • Author : Vamsi Chowdary Korata Date : 03-01-2026 - 3:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Venezuela
Venezuela

Venezuela వెనిజులా రాజధాని కరాకస్‌లో భారీ పేలుళ్లు సంభవించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులాపై భూతల దాడుల అవకాశం గురించి హెచ్చరికలు చేసిన తరుణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. డ్రగ్స్ రవాణాను అడ్డుకునేందుకు తాము కఠిన చర్యలకు దిగుతామని డొనాల్డ్ ట్రంప్ ఇటీవల వార్నింగ్ ఇచ్చారు. గత కొద్ది నెలలుగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గత సోమవారం బోట్లపై అమెరికా సైన్యం దాడిచేసింది. దానికి కొనసాగింపుగా సైనిక చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

  • పేలుళ్లతో దద్దరిల్లిన వెనుజులా రాజధాని కారకస్
  • డొనాల్డ్ ట్రంప్ మూడు రోజుల కిందట వార్నింగ్
  • డ్రగ్ కార్టెల్స్‌‌పై దాడులు చేస్తున్నట్టు అమెరికా ప్రకటన

వెనుజులా రాజధాని కరాకస్‌ నగరం భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. జనవరి 3న శనివారం తెల్లవారుజామున యుద్ధ విమానాలు పైనుంచి వెళ్తున్నట్లు శబ్దాలతో పాటు భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని ఏఎఫ్‌పీ జర్నలిస్ట్ తెలిపారు. కరేబియన్ దేశానికి నేవీ దళాలను పంపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వెనుజులాపై భూతల దాడుల అవకాశం గురించి ప్రస్తావించిన తరుణంలో ఈ పేలుళ్లు చోటుచేసుకోవడం గమనార్హం. స్థానిక కాలమానం ప్రకారం జనవరి 3న తెల్లవారుజామున 2 గంటల నుంచి 2.15 గంటల వరకు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ, అవి ఖచ్చితంగా ఏ ప్రాంతం నుంచి వచ్చాయనేది స్పష్టత లేదు. అయితే, ఏడు ప్రాంతాల్లో చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. పేలుళ్లకు జనం భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు.

వెనుజులా డ్రగ్స్‌ను రవాణా చేస్తోందని, పోర్టులో మత్తు పదార్థాలతో సిద్ధంగా ఉన్న బోట్లను ధ్వంసం చేశామని ట్రంప్ సోమవారం ప్రకటించారు. అయితే, ఇందుకోసం సైనిక చర్యనా లేక సీఐఏ ఆపరేషన్ చేపట్టారా? అనేది చెప్పడానికి ఆయన నిరాకరించారు. కేవలం అది తీరం వెంబడి జరిగిందని మాత్రమే వివరించారు. వెనిజులా గడ్డపై జరిగిన మొట్టమొదటి భూతల దాడి ఇదే. భూతల దాడుల గురించి ట్రంప్ హెచ్చరించిన తర్వాత వెనిజులాలో భారీ పేలుళ్లు సంభవించాయి. డ్రగ్స్ బోట్లపైనే దాడి జరిగినట్టు తెలుస్తోంది.

అమెరికా సైనిక ఒత్తిడి నేపథ్యంలో, వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో సోమవారం జరిగిన దాడిపై స్పందించలేదు. అయితే, వాషింగ్టన్‌తో సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని జనవరి 1న గురువారం తెలిపారు. మదురోను డ్రగ్ కార్టెల్ నాయకుడిగా అమెరికా ఆరోపిస్తూ, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకుంటామని చెబుతోంది. కానీ, వెనిజులాలో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్నాయని, అందుకే అమెరికా తన ప్రభుత్వాన్ని కూలదోయాలని చూస్తోందని మదురో ఆరోపిస్తున్నారు.

ఇటీవల, వెనిజులా గగనతలాన్ని మూసివేయడం, మరిన్ని ఆంక్షలు విధించడం, వెనిజులా చమురుతో నిండిన ట్యాంకర్లను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలతో కారకాస్‌పై ఒత్తిడి పెంచింది. డ్రగ్ కార్టెల్స్‌పై భూతల దాడులు చేస్తామని, అవి ‘త్వరలో’ ప్రారంభమవుతాయని ట్రంప్ వారాల తరబడి బెదిరిస్తున్నారు. సోమవారం జరిగిన సంఘటన దీనికి మొదటి ఉదాహరణగా కనిపిస్తోంది. దీంతో పాటు అమెరికా దళాలు కరేబియన్, తూర్పు పసిఫిక్ సముద్రంలో సెప్టెంబరు నుంచి అనేక దాడులు నిర్వహించారు. డ్రగ్ స్మగ్లర్లనే తాము టార్గెట్ చేసినట్టు అమెరికా తన దాడులను సమర్దించుకుంటోంది. కానీ, ఆ పడవల్లో డ్రగ్స్ ఉన్నాయనడానికి ఆధారాలను మాత్రం బయటపెట్టలేదు. అమెరికా సైన్యం వెల్లడించిన సమాచారం ప్రకారం.. యూఎస్ దళాలు చేసిన దాదాపు 30 దాడుల్లో కనీసం 107 మంది హతమైనట్టు తెలిపింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • america
  • Amid Tensions
  • Donald Trump
  • explosions
  • Venezuela

Related News

Attack on Chabahar port after Trump's warning

US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

డొనాల్డ్ ట్రంప్, మరిన్ని దాడులు జరిగితే మరింత బలమైన ప్రతిస్పందన ఉంటుందని టెహ్రాన్‌ను హెచ్చరించిన కొన్ని గంటల తర్వాత, గురువారం నాడు అమెరికా ఇరాన్ యొక్క వ్యూహాత్మక ఓడరేవు అయిన చబహార్‌లోని కీలక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు ప్రారంభించింది. ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రకారం, ఈ దాడులు ఆగ్నేయ ఓడరేవు నగరంలోని రెండు సముద్ర రేవులను మరియు ఒక సముద్ర ట్రాఫిక్ నియంత

  • Ceasefire with Iran is over... No more talks with Tehran after the attack on a ship in the Strait of Hormuz: Trump.

    Donald Trump: ఇరాన్‌తో సీజ్‌ఫైర్ ముగిసింది.. హార్ముజ్ లో షిప్ పై దాడి తర్వాత టెహ్రాన్‌తో ఇకపై చర్చలు ఉండవు : ట్రంప్

  • Highly Emotional Atmosphere

    Ali Khamenei Funeral : ఖమేనీ అంత్యక్రియల వేళ తీవ్ర భావోద్వేగ వాతావరణం .. అమెరికాపై భీకర ప్రతీకారానికి ‘రెడ్ అలర్ట్’ ..!

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd