HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Mark Zuckerberg Surpasses Bill Gates Is Now Richer By 28 Billion Dollars

Mark Zuckerberg Vs Bill Gates : బిల్‌గేట్స్‌ను దాటేసిన జుకర్‌బర్గ్.. అదెలా సాధ్యమైంది ?

Mark Zuckerberg Vs Bill Gates : సంపద విషయంలో మార్క్ జుకర్‌బర్గ్.. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌ను దాటేశాడు.

  • By Pasha Published Date - 01:54 PM, Sun - 4 February 24
  • daily-hunt
Mark Zuckerberg Vs Bill Gates
Mark Zuckerberg Vs Bill Gates

Mark Zuckerberg Vs Bill Gates : సంపద విషయంలో మార్క్ జుకర్‌బర్గ్.. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌ను దాటేశాడు. దీంతో ప్రపంచంలో నాలుగో అత్యంత సంపన్న వ్యక్తిగా జుకర్‌బర్గ్ నిలిచాడు. అమెరికా స్టాక్ మార్కెట్‌లో మెటా(ఫేస్ బుక్) షేరు  ధర ఒక్కసారిగా 22 శాతం పెరగడంతో ఈ భారీ మార్పు చోటుచేసుకుంది.   షేరు ధర 22 శాతం పెరగడంతో జుకర్ బర్గ్ సంపదలో మరో రూ.2 లక్షల కోట్లు వచ్చి చేరాయి. దీంతో ఆయన మొత్తం సంపద విలువ 13 లక్షల కోట్లకు ఎగబాకింది. ఇక బిల్ గేట్స్ మొత్తం సంపద విలువ ప్రస్తుతం రూ.10 లక్షల కోట్లు. ప్రస్తుతానికి సంపద విషయంలో ప్రపంచంలో జుకర్‌బర్గ్ కంటే ధనవంతులు ముగ్గురు మాత్రమే ఉన్నారు. వారు ఎవరంటే..  బెర్నార్డ్ ఆర్నాల్ట్, ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ .  జుకర్ బర్గ్(Mark Zuckerberg Vs Bill Gates) ప్రస్తుతం మెటా కంపెనీ సీఈవో హోదాలో ఉన్నారు. ఆయన వద్ద దాదాపు 35 కోట్ల క్లాస్ A,  క్లాస్  B షేర్లు ఉన్నాయి. మెటా కంపెనీ తమ మొట్టమొదటి డివిడెండ్‌ను మార్చిలో చెల్లించినప్పుడు దాదాపు రూ.1400 కోట్ల నగదును డివిడెండ్ రూపంలోనూ అందుకుంటారు, Meta కంపెనీ దాని 50-సెంట్ త్రైమాసిక డివిడెండ్‌ను కొనసాగిస్తే .. ఆ రూపంలో ప్రతి సంవత్సరం మరో రూ.5,700  కోట్లను మెటా సీఈవో ఖాతాలో జమ అవుతాయి.

We’re now on WhatsApp. Click to Join

ఎకానమీ క్లాస్‌లోనే బిల్‌గేట్స్ జర్నీ

మెటా సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ పనిలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఒకే రకమైన దుస్తులు ధరిస్తుంటారు. పైగా అవి పెద్ద ఖరీదైనవి కూడా కాదు. ఈ కోవకు చెందినవారే యాపిల్‌ సహ వ్యవస్థాపకుడు దివంగత స్టీవ్‌ జాబ్స్‌.మైక్రోసాఫ్ట్‌ సహ  వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌‌కు కు సంబంధించి కూడా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. దీన్ని ప్రముఖ వీడియో స్ట్రీమింగ్‌ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ సహ  వ్యవస్థాపకుడు మార్క్‌ రాండోల్ఫ్‌ ఇటీవల వెల్లడించారు. బిల్‌గేట్స్‌ చాలా కాలం పాటు విమానంలో సామాన్యులు ప్రయాణించే ఎకానమీ క్లాస్‌లోనే వెళ్లేవారని మార్క్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. బిజినెస్‌ క్లాస్‌ టికెట్‌కొనే స్తోమత ఆయనకు ఉన్నప్పటికీ.. దానికి చెల్లించే డబ్బులకు.. పొందే సేవ, సదుపాయాలకు పొంతన ఉండేది కాదని గేట్స్‌ అభిప్రాయం! ఎకానమీ క్లాస్‌తో పోలిస్తే తొమ్మిది రెట్లు అధికంగా చెల్లిస్తున్నప్పటికీ.. సదుపాయాలు మాత్రం ఆ స్థాయిలో ఉండేవి కాదని ఆయన భావించేవారట. పైగా ఏ క్లాస్‌లో ప్రయాణించినా.. చివరకు అందరూ ఒకే సమయానికి, ఒకే గమ్యస్థానానికి వెళ్తున్నప్పుడు అధికంగా చెల్లించాల్సిన అవసరం ఏముందని అనేవారట. ఈ విషయాన్ని మార్క్‌ ‘ఎక్స్‌ (ట్విటర్‌)’లో పోస్ట్‌ చేశారు. విమానంలో బిల్‌ గేట్స్‌ ఎకానమీ క్లాస్‌లో కూర్చొని ల్యాప్‌టాప్‌లో పనిచేసుకుంటున్న ఓ పాత ఫొటోను కూడా జత చేశారు.

Also Read :BBC – Ram Mandir : ‘రామమందిరం ప్రతిష్ఠాపన’పై కవరేజీ.. బీబీసీపై బ్రిటీష్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bill gates
  • business
  • Forbes Billionaires List
  • Mark Zuckerberg
  • Mark Zuckerberg Vs Bill Gates
  • meta

Related News

World Largest City

World Largest City: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద నగరం ఏదో తెలుసా?!

ఈ జాబితాలో ఇండోనేషియాకు చెందిన జకార్తా దాదాపు 42 మిలియన్ల మంది జనాభాతో ఇప్పుడు అగ్రస్థానంలో ఉంది. బంగ్లాదేశ్‌కు చెందిన ఢాకా దాదాపు 36 మిలియన్ల మంది జనాభాతో రెండవ స్థానంలో ఉంది.

  • Billionaire List

    Billionaire List: స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు.. ప్రపంచ కుబేరుల జాబితాలో పెను మార్పులు!

  • Bank

    Bank: రేపు ఈ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయా?

  • Luxury Cities

    Luxury Cities: ప్రపంచంలోని 10 అత్యంత విలాసవంతమైన నగరాలు ఇవే!

Latest News

  • Rishabh Pant: అభిమానుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన టీమిండియా క్రికెట‌ర్‌!

  • Ayodhya: ఆధ్యాత్మిక కేంద్రంగా అయోధ్య.. రియల్ ఎస్టేట్‌లో నూతన శకం!

  • Telangana Global Summit 2025 : గ్లోబల్ సమ్మిట్లో నోరూరించే తెలంగాణ వంటకాల ఫుడ్ మెనూ !!

  • Andhra King Taluka Review : రామ్ పోతినేని ఆంధ్రా కింగ్ తాలూకా మూవీ రివ్యూ!

  • Viral: చిరు తో కొండా సురేఖ సెల్ఫీ..మెగా క్రేజ్ అంటే ఇది కదా !!

Trending News

    • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

    • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

    • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

    • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd