Elon Musk : ‘‘నా బిడ్డకు తండ్రి మస్క్’’.. యాష్లీ సెయింట్ క్లెయిర్ ఎవరు ?
మా గోప్యతకు ఎవరూ భంగం కలిగించొద్దని కోరుతున్నా’’ అని యాష్లీ సెయింట్ క్లెయిర్(Elon Musk) విన్నవించారు.
- By Pasha Published Date - 11:48 AM, Sat - 15 February 25

Elon Musk : ‘‘నా బిడ్డకు తండ్రి అపర కుబేరుడు ఎలాన్ మస్క్’’ అని అమెరికా రచయిత్రి యాష్లీ సెయింట్ క్లెయిర్ ప్రకటించారు. ఈమేరకు ఆమె ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ‘‘నేను ఐదు నెలల కిందట ఒక బిడ్డకు జన్మనిచ్చాను. నా బిడ్డకు తండ్రి ఎలాన్ మస్క్. నా బిడ్డ గోప్యత, భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇంతకుముందు ఈ విషయాన్ని వెల్లడించలేదు. అయినా కొన్ని మీడియా సంస్థలు ఆ విషయాన్ని బయటపెట్టాలని ప్రయత్నించాయి. అందుకే ఇప్పుడు నేనే ఆ విషయంపై క్లారిటీ ఇస్తున్నా. మా సంతానం సురక్షిత వాతావరణంలో జీవించాలని నేను కోరుకుంటున్నాను. మా గోప్యతకు ఎవరూ భంగం కలిగించొద్దని కోరుతున్నా’’ అని యాష్లీ సెయింట్ క్లెయిర్(Elon Musk) విన్నవించారు. ఎక్స్ (ట్విట్టర్) సోషల్ మీడియా కంపెనీ ఎలాన్ మస్క్‌దే. ఎక్స్‌లో నిత్యం యాక్టివ్‌గా ఉండే మస్క్, ఇప్పటిదాకా యాష్లీ సెయింట్ క్లెయిర్ పోస్ట్‌పై స్పందించలేదు.
Also Read :Trump Vs Transgenders : ట్రాన్స్‌జెండర్లకు ట్రంప్ మరో షాక్.. అమెరికా ఆర్మీ కీలక ప్రకటన
ఎవరీ యాష్లీ సెయింట్ క్లెయిర్ ?
- యాష్లీ సెయింట్ క్లెయిర్ ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు అనుకూలంగా ప్రచారం చేశారు.
- ఈమె రచయిత. అమెరికాలోని ప్రముఖ పత్రికలకు రాజకీయ అంశాలపై కాలమ్స్ రాస్తుంటారు.
- యాష్లీ ఏడాది క్రితం అమెరికాలోని మాన్ హాట్టన్‌లో ఉన్న ఒక లగ్జరీ అపార్ట్‌మెంటులో అద్దెకు దిగారు. దాని అద్దె నెలకు రూ.13 లక్షలు.
- ఈ అపార్ట్‌మెంటులో మొట్టమొదటి టెస్లా సైబర్ ట్రక్ కొన్నది ఎవరో కాదు..యాష్లీ సెయింట్ క్లెయిర్ . బహుశా దాన్ని ఎలాన్ మస్క్ ఆమెకు గిఫ్టుగా ఇచ్చి ఉండొచ్చనే టాక్ వినిపిస్తోంది.
- గతంలో ఎవరో వ్యక్తితో రిలేషన్ షిప్ ద్వారా యాష్లీ సెయింట్ క్లెయిర్‌కు ఒక బాలుడు జన్మించాడని తెలిసింది. ఇప్పుడు మస్క్ ద్వారా మరో సంతానాన్ని ఆమె పొందిందని అంటున్నారు.
- డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రోజున రాత్రి మారా లాగోలో నిర్వహించిన ప్రత్యేక విందులో కూడా యాష్లీ సెయింట్ క్లెయిర్ పాల్గొన్నారు. దానికి ఎలాన్ మస్క్ కూడా హాజరయ్యారు.
- ఎలాన్ మస్క్‌కు ఇప్పటికే 12 మంది పిల్లలు ఉన్నారు. ఎలాన్ మస్క్ మొదటి భార్య జస్టిన్‌కు ఐదుగురు పిల్లలు ఉన్నారు. మరో భార్య కెనడియన్ గాయని గ్రిమ్స్‌కు ముగ్గురు పిల్లలు, ఇంకో భార్య, న్యూరాలింక్ ఉద్యోగికి ముగ్గురు పిల్లలు పుట్టారు.