London Explosion: లండన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వెలుపల భారీ పేలుడు!
పోలీసులు అనుమానాస్పద ప్యాకేజీని కనుగొన్న తర్వాత US ఎంబసీ చుట్టూ రద్దీగా ఉండే ప్రాంతాన్ని చుట్టుముట్టారు. దీంతో పాటు చాలా మందిని భవనం నుంచి బయటకు పంపారు.
- By Gopichand Published Date - 09:23 PM, Fri - 22 November 24

London Explosion: లండన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వెలుపల భారీ పేలుడు (London Explosion) సంభవించినట్లు వార్తలు వస్తున్నాయి. పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. పేలుడు జరిగినట్లు మెట్రోపాలిటన్ పోలీసులు ధృవీకరించారు. సెంట్రల్ లండన్‌లోని యుఎస్ ఎంబసీ దగ్గర పెద్ద శబ్ధం వినిపించిందని పోలీసులు తెలిపారు.
అనుమానాస్పద ప్యాకేజీ విచారణ
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారు. మెట్రోపాలిటన్ పోలీసులు ఇలా వ్రాశారు. నైన్ ఎల్మ్స్‌లోని యుఎస్ ఎంబసీ సమీపంలో జరిగిన ఒక సంఘటన గురించి మేము ఆన్‌లైన్‌లో తెలుసుకున్నాము. ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకున్నామనా రాశారు. అనుమానాస్పద పేలుడుపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Gold Price Today: మళ్లీ రూ.80 వేలకు చేరుతున్న బంగారం ధర.. హైదరాబాద్‌లో ఎంతంటే?
లోపల చాలా మంది ఉద్యోగులు
పోలీసులు అనుమానాస్పద ప్యాకేజీని కనుగొన్న తర్వాత US ఎంబసీ చుట్టూ రద్దీగా ఉండే ప్రాంతాన్ని చుట్టుముట్టారు. దీంతో పాటు చాలా మందిని భవనం నుంచి బయటకు పంపారు. తొలుత అరగంటకు పైగా లోపలే ఉంచారు. ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు భవనంలోనే ఉన్నారు.
పాంటన్ రోడ్డు మూసివేశారు
US ఎంబసీ తన X హ్యాండిల్‌పై ఇలా రాసింది. లండన్‌లోని US ఎంబసీ వెలుపల అనుమానాస్పద ప్యాకేజీపై స్థానిక అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు హాజరవుతున్నారు. ముందుజాగ్రత్తగా పాంటన్ రోడ్‌ను మూసివేశారని తెలిపారు.
విమానాశ్రయంలో కొంత భాగాన్ని ఖాళీ చేయించారు
ఈ సంఘటన తర్వాత లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయం సౌత్ టెర్మినల్‌లో ఎక్కువ భాగం ఖాళీ చేయించారు. దీంతో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఇది బ్రిటన్‌లో రెండవ అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయంగా పరిగణించబడుతుంది. ఒక విమానయాన సంస్థ ట్విట్టర్‌లో ఇలా పేర్కొంది. “మా ప్రయాణీకులు, ఉద్యోగుల భద్రత మా మొదటి ప్రాధాన్యత. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించడానికి మేము కృషి చేస్తున్నాము” అని పేర్కొంది.