LockDown In China : చైనాలో మళ్లీ లాక్‌డౌన్.. 3నెలల్లో అత్యధిక కేసులు నమోదు!!
చైనాలో మళ్లీ లాక్ డౌన్ విధించారు. మూడు నెలల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి.
- Author : hashtagu
Date : 14-10-2022 - 10:17 IST
Published By : Hashtagu Telugu Desk
చైనాలో మళ్లీ లాక్ డౌన్ విధించారు. మూడు నెలల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి కారణంగా ఐదు జిల్లాల్లో లాక్‌డౌన్ విధించింది. తైవాన్‌కు అమెరికాకు మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకున్న సమయంలో ఈ లాక్ డౌన్ విధించింది. దీంతోపాటు జాతీయ కాంగ్రెస్ సమావేశం జరగనుంది. చైనా మీడియా నివేదికల ప్రకారం, షాంఘైలో బుధవారం 47 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. ఈ రోగుల సంఖ్య గత మూడు నెలల్లో అత్యధికగా నమోదు అయ్యాయి. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ అవకాశం దృష్ట్యా, షాంఘైలోని 16 జిల్లాల్లో ఐదు జిల్లాల్లో కరోనా పరీక్షల కోసం కఠినమైన ఆంక్షలు విధించారు. చైనా వ్యాపార కేంద్రంగా పేరొందిన షాంఘైలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రద్దీగా ఉండే ప్రాంతాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. దీనితో పాటు, అనేక ఇతర సంస్థలు కూడా మూసివేశారు. షాంఘైలోని ఈ జిల్లాలలో, కరోనా పరీక్ష జరిగే వరకు ప్రజలు కఠినమైన ఆంక్షలలో ఉండవల్సిందేని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.
కాగా చైనాలో జాతీయ కాంగ్రెస్ 20వ సదస్సు జరగనుంది. ఈ తరుణంలో చైనాలో కరోనా వైరస్ విజృంభించింది. ఈ సమావేశం ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కాగా ఈసారి ఈ సదస్సులో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తన పదవీకాలాన్ని పొడిగించే విషయాన్ని ప్రకటించవచ్చనే చర్చ జోరుగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చైనాలో కరోనా వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. జీరో కోవిడ్ విధానంపై చైనాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధానం వల్ల బహుళ జాతీయ కంపెనీలు ఇక్కడ భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయి.