Kim Jong Un: కిమ్ తగ్గేదేలే
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ అణ్వాయుధాల విషయంలో తగ్గట్లేదు. శత్రువులు రెచ్చిపోతే అణుదాడికి వెనుకాడబోమని కిమ్ జాంగ్ అంటున్నాడు. శత్రు దేశాలు బెదిరిస్తే
- By Praveen Aluthuru Published Date - 05:34 PM, Sat - 23 December 23

Kim Jong Un: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ అణ్వాయుధాల విషయంలో తగ్గట్లేదు. శత్రువులు రెచ్చిపోతే అణుదాడికి వెనుకాడబోమని కిమ్ జాంగ్ అంటున్నాడు. శత్రు దేశాలు బెదిరిస్తే లేదా అణు దాడికి ప్రేరేపించినట్లయితే మేము అణ్వాయుధాలను ప్రయోగించడానికి వెనుకాడబోమని కిమ్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు. తాజాగా ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి హ్వాంగ్-18ని ప్రయోగించింది. ఇప్పటి వరకు ఉత్తర కొరియాలో ఇదే అత్యంత శక్తివంతమైన క్షిపణి. అయితే కిమ్ జోంగ్ అణ్వాయుధ దాడిని బెదిరించడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా కిమ్ జాంగ్ చాలాసార్లు ఇలాంటి బెదిరింపులకు పాల్పడ్డాడు. కిమ్ తాజా బెదిరింపు తర్వాత, అమెరికా, దక్షిణ కొరియా మరియు జపాన్ ఒక ప్రకటన విడుదల చేశాయి. రెచ్చగొట్టే చర్యలను ఆపాలని అణ్వాయుధ దేశాలకు విజ్ఞప్తి చేశాయి.
అయితే ఐక్యరాజ్యసమితి వేదికపై ఉత్తర కొరియా తన అణ్వాయుధ పరీక్షలను సమర్థించుకుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉత్తర కొరియా రాయబారి కిమ్ సాంగ్ మాట్లాడుతూ.. అమెరికా పదేపదే అణు దాడితో బెదిరిస్తోంది. అందువల్ల, అమెరికా ఆయుధ వ్యవస్థతో సమానంగా స్వంత ఆయుధ వ్యవస్థను అభివృద్ధి చేయడం తమ హక్కుగా చెప్పుకుంది.
Also Read: Drone Attack : భారత్ తీరంలో ఇజ్రాయెలీ నౌకపై డ్రోన్ ఎటాక్