Aman Dhaliwal: ‘ఖలేజా’ నటుడు పై అమెరికాలో దాడి..
ప్రముఖ నటుడు అమన్ ధలీవాల్‌పై అమెరికాలో దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి గొడ్డలి లాంటి ఆయుధంతో ఆయనపై దాడికి పాల్పడ్డాడు.
- Author : Maheswara Rao Nadella
Date : 17-03-2023 - 11:51 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రముఖ నటుడు అమన్ ధలీవాల్‌పై (Aman Dhaliwal) అమెరికాలో దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి గొడ్డలి లాంటి ఆయుధంతో ఆయనపై దాడికి పాల్పడ్డాడు. కాలిఫోర్నియాలోని ప్లానెట్ ఫిట్‌నెస్ జిమ్‌లో జరిగిన ఈ దాడిలో ఆయన శరీరంపై పలు చోట్ల గాయాలయ్యాయి. జిమ్‌కు వెళ్లిన ఆయనపై అందరూ చూస్తుండగానే ఈ దాడి జరిగింది. వెంటనే తేరుకున్న జిమ్ సిబ్బంది గాయపడిన అమన్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. నటుడిపై దాడి ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది.
అమన్‌పై (Aman Dhaliwal) నిందితుడు ఎందుకు దాడిచేశాడన్న విషయంలో ఇంకా క్లారిటీ లేదు. శరీరమంతా కట్లతో ఉన్న ధలీవాల్ ఫొటో, నిందితుడు దాడిచేస్తున్న ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ధలీవాల్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నుంచి కానీ, ఆయన కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు.
పంజాబ్‌లోని మాన్సాకు చెందిన ధలీవాల్ పంజాబీ, హిందీతోపాటు పలు తెలుగు సినిమాల్లోనూ నటించారు. హృతిక్ రోషన్, ఐశ్వర్యరాయ్ నటించిన జోదా అక్బర్ సినిమాలో రాజ్‌కుమార్ రతన్‌సింగ్ పాత్ర పోషించారు. తెలుగులో ఖలేజా (Khaleja) సినిమాలో నటించారు. అలాగే విస్రా, ఇక్‌కుడి పంజాబ్ డి, జాట్ బాయ్స్ పూత్ జట్టన్ డి, అనంత్ ది ఎండ్ తదితర సినిమాల్లో నటించారు.
Also Read: Snow Leopard: లడఖ్ లో మంచు చిరుత వేట.. వీడియో ఇదిగో!