Kamala Teleprompter : మొరాయించిన టెలీ ప్రాంప్టర్.. ‘32 డేస్’ అని పదేపదే వల్లెవేసిన కమలా హ్యారిస్
అకస్మాత్తుగా టెలీ ప్రాంప్టర్‌లో(Kamala Teleprompter) వాక్యాలు రన్ కాకుండా ఆగిపోయినప్పుడు చదవడానికి చివరి పదమే మిగులుతుంది.
- Author : Pasha
Date : 05-10-2024 - 3:44 IST
Published By : Hashtagu Telugu Desk
Kamala Teleprompter : ఎన్నికల ప్రచార సభలలో ప్రముఖులు టెలీప్రాంప్టర్లను ఉపయోగి స్తుంటారు. వాటి స్క్రీన్‌పై ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చే వాక్యాలను చూస్తూ.. ప్రసంగ పాఠాన్ని గడగడా చదివేస్తుంటారు. టెలీప్రాంప్టర్‌ను చూస్తూ ప్రసంగించే క్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ లాంటి ప్రముఖ నాయకులు తడబడిన సందర్బాలు కూడా ఉన్నాయి. అకస్మాత్తుగా టెలీ ప్రాంప్టర్‌లో(Kamala Teleprompter) వాక్యాలు రన్ కాకుండా ఆగిపోయినప్పుడు చదవడానికి చివరి పదమే మిగులుతుంది. ఇదే విధమైన చేదు అనుభవాన్ని తాజాగా అమెరికా వైస్ ప్రెసిడెంట్, డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ ఎదుర్కొన్నారు.
Oh HELL NO: KH has no clue what to say after her teleprompter appears to stop working, keeps repeating herself.
The Migrants VP kept repeating “32 days.”
MAGA Republicans will save America! pic.twitter.com/YOHRdEQEJo
— CoolBlue (@BackThebluecool) October 5, 2024
Also Read :Elon Musk : తప్పుడు అకౌంటుకు రూ.43 కోట్ల ట్రాన్స్‌ఫర్.. ‘ఎక్స్’ తప్పిదంతో ఏమైందంటే ?
దీంతో ఆమె టెలిప్రాంప్టర్‌లో చివరగా వచ్చిన ‘32 రోజులు’ అనే పదాన్నే పదేపదే వల్లె వేశారు. చివరకు ఎలాగోలా టెలి ప్రాంప్టర్ పనిని మొదలుపెట్టడంతో.. ‘‘ఎన్నికలకు 32 రోజుల సమయం మాత్రమే మిగిలింది. ఈ పోటీ కష్టమైనప్పటికీ మనమే ఘన విజయం సాధిస్తాం’’ అని కమల ఆ వాక్యాన్ని పూర్తి చేశారు. అమెరికాలోని మిచిగాన్‌లో జరిగిన డెమొక్రటిక్ పార్టీ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించే క్రమంలో కమల ఈ చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాది మంది డెమొక్రటిక్ పార్టీ కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనతో టెలీ ప్రాంప్టర్‌పై కమల పూర్తిగా ఆధారపడుతున్నారని పలువురు నెటిజన్లు విమర్శించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హ్యారిస్ (డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి), డొనాల్డ్ ట్రంప్ (రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి) హోరాహోరీగా తలపడుతున్నారు. పదునైన ప్రసంగాలతో ట్రంప్ ప్రజల మదిని దోచుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఈ రేసులో ట్రంప్ ముందంజలో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రభావం కూడా నవంబరు 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై పడుతుందని అంచనా వేస్తున్నారు.