Biden Pardons Son : తండ్రిగా, దేశాధ్యక్షుడిగా జో బైడెన్ సంచలన నిర్ణయం.. కుమారుడికి క్షమాభిక్ష
నా కుమారుడు హంటర్ బైడెన్‌ను(Biden Pardons Son) అన్యాయంగా కోర్టుల్లో విచారించే సమయంలోనూ నేను చూస్తూ ఉండిపోయాను.
- By Pasha Published Date - 10:12 AM, Mon - 2 December 24

Biden Pardons Son : జో బైడెన్.. అమెరికా ప్రెసిడెంట్ హోదాలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. జనవరి 19 వరకే ఆయన అమెరికా అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఈ తరుణంలో తన కుమారుడు హంటర్ బైడెన్‌కు మేలును చేకూర్చే ఒక కీలక నిర్ణయాన్ని జో బైడెన్ ప్రకటించారు. అక్రమంగా ఆయుధం కొనుగోలు సహా రెండు క్రిమినల్ కేసుల్లో హంటర్ బైడెన్‌కు క్షమాభిక్షను ప్రసాదిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తన కుమారుడిపై నమోదైన ఆ కేసులు రాజకీయ ప్రేరేపితమైనవని జో బైడెన్ తెలిపారు. ఈసందర్భంగా అమెరికా ప్రజలకు జో బైడెన్ కీలక సందేశాన్ని విడుదల చేశారు. ఒక తండ్రిగా, ఒక దేశాధ్యక్షుడిగా తాను తీసుకున్న నిర్ణయాన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలని వారిని కోరారు. ‘‘నా కుమారుడు హంటర్ బైడెన్‌ను(Biden Pardons Son) అన్యాయంగా కోర్టుల్లో విచారించే సమయంలోనూ నేను చూస్తూ ఉండిపోయాను. ఎన్నడూ కోర్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. గతంలో కొందరు రాజకీయ కుట్రలో భాగంగా నా కుమారుడిపై కేసులు పెట్టించారు. ఇక జరిగింది చాలు. ఆ కేసుల్లో హంటర్‌కు క్షమాభిక్ష ప్రసాదిస్తున్నా’’ అని జో బైడెన్ తెలిపారు. కాగా, హంటర్ బైడెన్ పలు కేసుల్లో దోషిగా తేలిన సమయంలో క్షమాభిక్ష ప్రసక్తే లేదన్న జో బైడెన్.. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడంపై అమెరికన్లు చర్చించుకుంటున్నారు.
Also Read :SI Suicide : సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఎస్సై సూసైడ్
హంటర్‌పై కేసులు..
- 2018 సంవత్సరంలో తుపాకీ కొనే సందర్భంగా ఆయుధ డీలరుకు ఇచ్చిన అప్లికేషన్ ఫాంలో హంటర్ తప్పుడు సమాచారం ఇచ్చారు. తాను అక్రమంగా డ్రగ్స్ కొనలేదని, వాటికి బానిస కాలేదని, తన దగ్గర అక్రమ ఆయుధం లేదని తెలిపారు. అయితే దర్యాప్తులో అవన్నీ అబద్దాలే అని తేలాయి.
- అక్రమ ఆయుధాన్ని కొన్న కేసులో ఈ ఏడాది జూన్‌లో కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. అయితే ఇంకా శిక్ష ఖరారు కాలేదు.
- కాలిఫోర్నియాలో రూ.11 కోట్ల పన్ను ఎగవేత ఆరోపణలతో ఆయనపై మరో కేసు నమోదైంది.