Jack Ma returned to China: చైనాకు తిరిగొచ్చిన జాక్ మా..! ఇక అలీబాబా 6 ముక్కలు..
చైనా బిలియనీర్, అలీబాబా వ్యాపార గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా ఎట్టకేలకు స్వదేశానికి తిరిగొచ్చారు.ఆయన తన అలీబాబా గ్రూప్ కోసం నిధులను సేకరించడానికి,
- Author : Maheswara Rao Nadella
Date : 30-03-2023 - 5:30 IST
Published By : Hashtagu Telugu Desk
Jack Ma returned to China : చైనా బిలియనీర్, అలీబాబా వ్యాపార గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా ఎట్టకేలకు స్వదేశానికి తిరిగొచ్చారు.ఆయన తన అలీబాబా గ్రూప్ కోసం నిధులను సేకరించడానికి, వ్యాపారాన్ని మళ్లీ గాడిన పెట్టేందుకు కొత్త ప్రణాళికను ప్రకటించాడు. అలీబాబా గ్రూప్ యొక్క వివిధ వ్యాపారాలను 6 భాగాలుగా విభజిస్తానని వెల్లడించారు. దీంతో అలీబాబా గ్రూప్ ఇప్పుడు 6 వేర్వేరు కంపెనీలుగావిడిపోనుంది. 2021లో చైనాను వదిలి వెళ్ళిన జాక్ మా (Jack Ma) ఎక్కువ కాలం పాటు ఆస్ట్రేలియా, జపాన్, థాయ్‌లాండ్ లలో గడిపాడు. ఆయన చైనాకు తిరిగి వచ్చిన వెంటనే అలీబాబా గ్రూప్ షేర్ల ధరలు కూడా పెరిగాయి.
విభజన ఇలా..
అలీబాబా గ్రూప్ కు 24 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ వ్యాపార గ్రూప్ విభజించబడటం ఇదే మొదటిసారి. అలీబాబా గ్రూప్ తన మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్, డిజిటల్ కామర్స్, లాజిస్టిక్స్ , ఇతర పనులను 6 వేర్వేరు కంపెనీలుగా విభజించబోతోంది.అలీబాబా కంపెనీ వ్యాపారం క్లౌడ్ ఇంటెలిజెన్స్ గ్రూప్, టావోబావో టిమాల్ కామర్స్ గ్రూప్, లోకల్ సర్వీసెస్ గ్రూప్, కైనియావో స్మార్ట్ లాజిస్టిక్స్ గ్రూప్, గ్లోబల్ డిజిటల్ కామర్స్ గ్రూప్ , డిజిటల్ మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్ గ్రూప్ వంటి విభిన్న వ్యాపారాలుగా విభజించబడుతుంది.
మారిన చైనా వ్యూహం ప్రభావం
కరోనాకు సంబంధించిన ఆంక్షలు, లాక్‌డౌన్ల కారణంగా చైనాలో వ్యాపారం చాలా నష్టపోయింది. అదే సమయంలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించు కోవడానికి అమెరికా, యూరప్‌లోని చాలా కంపెనీలు తమ వ్యాపారాలను అక్కడి నుండి ఇతర దేశాలకు తరలిస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో, చైనా తన దేశీయ ప్రైవేట్ రంగానికి సంబంధించిన వ్యూహాన్ని మార్చింది.దేశీయ ప్రైవేట్ రంగ సంస్థలను ప్రోత్సహించేందుకు నియంత్రణ నిబంధనలను తగ్గిస్తున్నట్లు చైనా ప్రకటించింది. కరోనా పరిమితుల కారణంగా, యుఎస్‌లో అలీబాబా గ్రూప్ లిస్టెడ్ షేర్ల విలువ 70 శాతానికి పైగా పడిపోయింది. రీసెంట్ గా జాక్ మా రిటర్న్ అయ్యాక ఇప్పుడు అలీబాబా గ్రూప్ విభజన వార్తల తర్వాత 14 శాతం పెరిగాయి.
Also Read: Boy’s Weight Record: 200 కిలోల నుంచి 114 కిలోలకు.. ఎలా సాధ్యమైంది?