Boy’s Weight Record: 200 కిలోల నుంచి 114 కిలోలకు.. ఎలా సాధ్యమైంది?
ఇండోనేషియాకు చెందిన 9 ఏళ్ల బాలుడు ఆర్య పెర్మనా బరువు కొన్నేళ్ల క్రితం దాదాపు 200 కిలోలు. ఇప్పుడు అతడి బరువు దాదాపు 86 కేజీలు..
- Author : Maheswara Rao Nadella
Date : 30-03-2023 - 4:00 IST
Published By : Hashtagu Telugu Desk
Boy’s Weight Record : ఇండోనేషియాకు చెందిన 9 ఏళ్ల బాలుడు (Boy’s) ఆర్య పెర్మనా బరువు కొన్నేళ్ల క్రితం దాదాపు 200 కిలోలు. ఇప్పుడు అతడి బరువు దాదాపు 86 కేజీలు.. ఇంతకీ అతను బరువు ఒక్కసారిగా ఎలా తగ్గాడు అనేది తెలుసుకోవాలంటే ఈ వార్తను చదవాల్సిందే..
114 కిలోలు డౌన్..
సగటు కంటే ఎక్కువ బరువు ఉన్నవారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం మీరు సోషల్ మీడియాలో అలాంటి పిల్లల ఫోటోను చూసి ఉంటారు. అటువంటి ఓ కుర్రాడి పేరు ఆర్య పెర్మనా.. ప్రపంచంలోనే అత్యంత లావుగా ఉన్న అబ్బాయి ఇతడు. అయితే అతడు దాదాపు 114 కిలోల బరువును తగ్గించుకోగలిగాడు. అతను బరువు తగ్గడానికి ఇండోనేషియా యొక్క ప్రసిద్ధ బాడీబిల్డర్ సహాయం చేశాడు.
కూర్చోలేనంత లావుగా..
ఆర్యకు వీడియో గేమ్‌లు ఆడడం చాలా ఇష్టం. అతను రోజంతా ప్రాసెస్ చేసిన ఆహారం, జంక్ ఫుడ్, ఇన్‌స్టంట్ నూడుల్స్, వేయించిన చికెన్, శీతల పానీయాలు తీసుకునే వాడు. అంటే.. ఇంత చిన్న వయస్సులో కూడా అతను దాదాపు 7,000 కేలరీల ఫుడ్ ను తింటున్నాడు. ఇది అతని శరీరానికి అవసరమైన దానికంటే ఏడు రెట్లు ఎక్కువ. శరీర బరువు పెరిగిపోయి ఒకానొక దశలో ఆర్య నడవలేకపోయాడు..కూర్చోలేకపోయాడు. అతనికి బట్టలు కూడా సరిపోలేదు.
బేరియాట్రిక్ సర్జరీ తర్వాత..
ఈనేపథ్యంలో ఆర్య 2017 ఏప్రిల్ లో బేరియాట్రిక్ సర్జరీ చేయించు కున్నాడు. దీంతో ఈ సర్జరీ చేయించుకున్న అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. జకార్తాలోని ఓమ్ని హాస్పిటల్‌లో శస్త్రచికిత్స తర్వాత, అతను వ్యక్తిగత వ్యాయామశాలను కలిగి ఉన్న బాడీబిల్డింగ్ ఛాంపియన్ అడె రాయ్‌ను కలిశాడు. ఆర్య గురించి తెలుసుకున్న ఆడే.. సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. ఆ తర్వాత ఆర్య తీసుకునే ఫుడ్ మెనూను మార్చేశాడు. కూరగాయలు, తృణధాన్యాలు వంటి లో కార్బ్ ఫుడ్స్ తినడం మొదలుపెట్టాడు. దీనితో పాటు అతను ఆడెతో రోజూ వెయిట్ ట్రైనింగ్ చేయడం ప్రారంభించాడు. ఇది కేలరీలను బర్న్ చేయడం, కండరాలను టోన్ చేయడంలో సహాయపడింది.
వ్యాయామం ఎంజాయ్ చేశాడు..
ఆర్య జిమ్‌లో వ్యాయామం చేయడం ప్రారంభించాడు. ఆర్య రోజూ చాలా నడిచేవాడు. ఇది అదనపు కేలరీలను బర్న్ చేయడంలో అతనికి సహాయపడింది. ఆర్య మూడేళ్ళలో సగానికి పైగా బరువు తగ్గే సమయానికి.. అతడి వయసు 13 సంవత్సరాలు. ఆడే మరియు ఆర్యల సంబంధం చాలా బలంగా మారింది. ఇద్దరూ మామ, మేనల్లుడిలా జీవిస్తున్నారు. ఆర్య ఇప్పుడు పాఠశాలకు వెళ్తున్నాడు. తన సొంత పనులు తానే చేసుకుంటున్నాడు. ఫుట్‌బాల్, టెన్నిస్, బ్యాడ్మింటన్ కూడా ఆడుతున్నాడు.
Also Read: WhatsApp Disappearing Messages: వాట్సాప్ డిసప్పియరింగ్ మెసేజెస్ కోసం 15 కొత్త టైమింగ్స్