Israel Mossad : దెబ్బతిన్న మొస్సాద్ నిఘా వ్యవస్థ..!
Israel Mossad ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొస్సాద్ నిఘా వ్యవహారాల్లో ఎప్పుడు ముందు చూపులో ఉంటుంది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొస్సాద్
- By Ramesh Published Date - 02:01 PM, Sat - 14 October 23
Israel Mossad ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొస్సాద్ నిఘా వ్యవహారాల్లో ఎప్పుడు ముందు చూపులో ఉంటుంది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొస్సాద్ (Mossad) శత్రువు ఎక్కడ ఉన్నా సరే వెతికి వేటాడి హత మార్చడమే లక్ష్యంగా పనిచేసేది. అయితే అలాంటి మొస్సాద్ కళ్లుగప్పి ఇజ్రాయెల్ పై హమాస్ ఉగ్రవాదుల దాడి ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ప్రపంచంలో చీమ చిటుక్కుమన్నా ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ పసిగెడుతుంది. కానీ గాజా నుంచి హమాస్ ఉగ్రవాదులు చేసే ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్ దాడిని మొస్సాద్ సంస్థ కనిపెట్టలేకపోయింది.
భారత్ తో సహా అనేక దేశాలు నిఘా, ఆపరేషన్ల కోసం ఇజ్రాయెల్ పై ఆధారపడతాయి హమాస్ దాడితో ఇప్పుడు ఈ దేశాలన్నీ కూడా సమీక్షించుకుంటున్నాయి. స్వతంత్ర దేశంగా ఏర్పాటు జరిగిన నాటి నుంచి ఇజ్రాయెల్ పై దాడులు జరుగుతున్నాయి. అయితే వీటిని ఎదుర్కోవడానికే పటిష్టమైన నిఘా సంస్థ ఏర్పాటు చేసుకున్నారు. ఇజ్రాయెల్ తొలి ప్రధాని డేవిడ్ బెన్ గురియన్ అమాన్ పేరుతో సైనిక నిఘా విభాగం ఏర్పాటు చేశారు. దానితో పాటుగా అంతర్గత భద్రత కోసం ఇజ్రాయెల్ సెక్యురిటీ ఏజెన్సీ (షింబెట్) ని ఏర్పాటు చేశారు.
విదేశాల్లో నిఘా వ్యవహారాలు కోసం విదేశాంగ శాఖ పరిధిలో ఒక రాజకీయ విభాగాన్ని ఏర్పాటు చేశారు. అరబ్బుల పట్ల అనుసరించాల్సిన విధానం పై విదేశాంగ మంత్రి మోషె షెరెట్కు, ప్రధాని గిరియన్ మధ్య విభేధాలు వచ్చాయి. ఇజ్రాయెల్ పై యుద్ధం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న రియాద్ ను అంతం చేయాలని 1948 డిసెంబర్ 12న గురియన్ రాజకీయ విభాగాన్ని ఆదేశించారు. దానికి షెరెట్ అంగీకరించలేదు. అప్పటి నుంచి ప్రధాని గురియన్ రాజకీయ విభాగాన్ని కూడా విదేశాంగ శాఖ నుంచి తొలగించి తన ఆధీనంలో పెట్టుకున్నారు. ఆ తర్వాత దాన్ని ఇన్ స్టిట్యూట్ ఫర్ ఇంటెలిజెన్స్ అండ్ స్పెషల్ ఆపరేషన్స్ గా మార్చారు. దీన్నే హిబ్రూ లో మొస్సాద్ గా పిలుస్తారు.
మొస్సాద్ ఏర్పాటు జరిగినప్పటి నుంచి ప్రపంచం మొత్తం షాక్ అయ్యే ఆపరేషన్లు నిర్వహించింది. 1976లో పాలస్తీనా మిలిటెంట్లు ఇజ్రాయెల్ (Israel) రాజధాని టెల్ అవీవ్ నుంచి పారిస్ వెళ్తున్న ఎయిర్ ఫ్రాన్స్ విమానాన్ని హైజాక్ చేసి ఉంగాడా పంపించారు. మొస్సాద్ ఫైటర్లు ఆపరేషన్ థం డర్బోల్ట్ పేరుతో జూలై 4న ఉగాండా ఎయిర్ పోర్ట్ లో హైజాకర్ల పై దాడి చేసి వారిని హతమార్చారు. యూదులను గుర్తించి వారిని అంతం చేయడమే లక్ష్యంగా హిట్లర్ ఫైనల్ సొల్యూషన్ ఆపరేషన్ స్టార్ట్ చేశాడు. అడాల్ఫ్ ఐక్మెన్ ఈ ఆపరేషన్ కి నేతృత్వం వహించాడు. మొస్సాద్ ఐక్మెన్ అర్జెంటీన రాజధాని బ్యూనస్ ఎయిర్ ఫ్రాన్స్ లో ఉన్నట్టుగా గుర్తించారు. అతడిని అపహరించి అర్జ్టీనా కళ్లుగప్పి 1960 మే 11న విమానంలో ఇజ్రాయెల్ కు అతడిని తీసుకెళ్లడం లో మొస్సాద్ పనితీరు అందరినీ ఆశ్చర్యపరిచింది.
2011 నవంబర్ 12న ఇరాన్ రాజధాని టెహరాన్ దగ్గర్లో కండాంతర అణ్వస్త్ర కిపణి స్థావరాన్ని పేల్చి వేయడం తో పాటుగా సైబర్ దాడులతో ఇరాన్ అణు కర్మాగారాన్ని ధ్వంసం చేయడం లో కూడా మొస్సాద్ విజయవంతం అయ్యింది. ఇంత చరిత్ర కలిగిన మొస్సాద్ ఇప్పుడు ఎందుకు విఫలమైంది అన్నది అందరి ప్రశ్న. అయితే దీనిపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి.
హమాస్ అనుసరించిన అణుకువ సిద్ధాంతం శత్రువు ఏమరపాటుగా ఉన్నప్పుడేం ఎదురుదాడి చేయాలన్న యుద్ధ నీతి ప్రధానమైందని. రెండేళ్లుగా హమాస్ ఎలాంటి హడావిడి చేయకుండా వాళు యాక్టివ్ గా లేరన్నట్టు ఉండి మొస్సాద్ ని నమ్మించింది. అనధికారికంగా ఇజ్రాయెల్ తో అప్పుడప్పుడు సంప్రదింపులు జరుపుతూ వచ్చింది. ఇజ్రాయెల్ ను నమ్మించి హమాస్ గాజాలో దాడి జరుగుతుందని నిఘా సమాచారం వచ్చినా పట్టించుకోలేదు. ఇజ్రాయెల్ దాళాలైతే హమాస్ ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు విశ్రాంతిలో ఉన్నాయి.
ఎంతో సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఇజ్రాయెల్ సమాచార సేకరణ లోపం వల్ల నిఘా వ్యవస్థ బలహీన పడిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనుకూలమైన అవకాశం కోసం ఎదురుచూసిన హమాస్ దాడికి సిద్ధమైంది. ఈ దాడి కి రెండేళ్ల కిందటే వ్యూహం రచించిందని అమలు కోసం యువకులను ఎంపిక చేసి దాడి చేసిందని తెలుస్తుంది. ఎంపిక చేసిన వారెవరు కూడా సెల్ఫోన్లు, అంతర్జాలం వాడకుండా జాగ్రత్త తీసుకుంది. ఇజ్రాయెల్ నిఘా శాటిలైట్ కు దొరక్కుండా సీక్రెట్ గా ట్రైనింగ్ ఇచ్చారు. ఆయుధాల సరదరాను కూడా సొరంగాలు నిర్మించారని తెలుస్తుంది. మహాస్ దాడిలో ఎంతో ఆస్తి ప్రాణ నష్టం జరిగింది. మొస్సాద్ నిఘా వ్యవస్థ ఇది అసలు కనిపెట్టలేకపోయింది.
Also Read : Banks Closed: దసరా పండుగ సందర్భంగా బ్యాంకులకు భారీగా సెలవులు..!
Related News
Iran Vs Israel : ఇజ్రాయెల్ ఖబడ్దార్.. అణుబాంబులు తయారు చేస్తాం : ఇరాన్
ఈ ఏడాది ఏప్రిల్లో సిరియా రాజధాని డమస్కస్లోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది.