HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Iran Sent War Warning To Israel Via Un

Israel Vs Iran : గాజాలోకి ఇజ్రాయెల్ అడుగుపెడితే యుద్ధమే.. ఇరాన్ ప్రకటన

Israel Vs Iran : ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

  • Author : Pasha Date : 15-10-2023 - 6:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Israel Vs Iran
Israel Vs Iran

Israel Vs Iran : ఇజ్రాయెల్ – హమాస్ యుద్ధంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ కు ఇరాన్ మరోసారి గట్టి వార్నింగ్ ఇచ్చింది. అయితే ఈసారి ఐక్యరాజ్యసమితి (యూఎన్)లోని తమ దౌత్య విభాగం ద్వారా ఇజ్రాయెల్ కు ఈ వార్నింగ్ సందేశాన్ని అధికారికంగా పంపించింది. గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ ను ఇజ్రాయెల్ మొదలుపెడితే తాము తప్పకుండా స్పందించాల్సి వస్తుందని స్పష్టం చేసింది.  యుద్ధ నేరాలు, వర్ణ వివక్ష, మారణహోమాన్ని ఇజ్రాయెల్ ఆపకపోతే పరిస్థితి అదుపు తప్పుతుందని ఇరాన్ హెచ్చరించింది. ఈమేరకు తాము ఇజ్రాయెల్ కు పంపిన సందేశంతో సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టింది. గాజాలో పరిస్థితిని చక్కదిద్దాల్సిన బాధ్యత ఐక్యరాజ్యసమితి, భద్రతా మండలిలోని దేశాలపై ఉందని స్పష్టం చేసింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ప్రకటన విడుదల చేయడానికి ముందు ఇరాన్ .. ఇజ్రాయెల్ బార్డర్ లోని సిరియా, లెబనాన్, ఇరాక్, టర్కీ, సౌదీ, ఖతర్ దేశాల అధినేతలతో కూడా చర్చలు జరిపింది. యుద్ధం చేయాల్సి వస్తే తమకు సహకరించాలని కోరినట్లు తెలుస్తోంది. ఖతర్ మధ్యవర్తిత్వం ద్వారా ఈ చర్చలన్నీ జరిగాయని అంటున్నారు. మరోవైపు  గాజాలో తమ సైన్యంతో ఇవాళ గ్రౌండ్ ఆపరేషన్ ను మొదలుపెట్టేందుకు ఇజ్రాయెల్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇవాళ ఏ క్షణమైనా గ్రౌండ్ ఆపరేషన్ మొదలవుతుందని అంచనా వేస్తున్నారు.

అమెరికా వర్సెస్ ఇరాన్

మరోవైపు అమెరికా ఆయుధాలతో ప్రత్యేక యుద్ధ నౌక మార్గం మధ్యలో ఉంది. ఒకవేళ ఈ యుద్ధంలోకి ఇరాన్ ఎంటరైతే.. దాన్ని కట్టడి చేసే లక్ష్యంతోనే అమెరికా ఆయుధ సంపత్తిని ఇజ్రాయెల్ కు పంపిస్తోందని అంటున్నారు. గాజా గ్రౌండ్ ఆపరేషన్ నేపథ్యంలో లక్షలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఈజిప్ట్ బార్డర్ కు వలస వెళ్లారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు దాదాపు 2300 మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోగా, దాదాపు 10వేల మందికిపైగా తీవ్ర గాయాలతో (Israel Vs Iran) ఆస్పత్రి పాలయ్యారు.

Also Read: Ind – Pak Match : వారే ఈ విజయానికి కారణం…ఏ జట్టునూ తేలిగ్గా తీసుకోమన్న రోహిత్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Iran Warning
  • Israel Vs Iran
  • Israel.
  • UN
  • War Warning

Related News

Iran's president apologises for air strikes on Gulf countries

ఇకపై దాడులు ఉండవు..పొరుగు దేశాలకు ఇరాన్ అధ్యక్షుడి క్షమాపణలు

Iran’s President Apologises For Air Strikes On Gulf Countries  అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో యుద్ధం కొనసాగుతున్న సమయంలో, గల్ఫ్ దేశాలకు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ క్షమాపణలు చెప్పారు. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఆస్తులపై బాంబు దాడులు చేస్తోంది. తమ దేశంపై దాడులు చేస్తే ప్రతిదాడి చేస్తామని గల్ఫ్ దేశాలు కూడా ఇరాన్‌ను హెచ్చరించాయి.

  • Iran Israel War Schools Shut In Kashmir

    హైఅలర్ట్‌.. ఖమేనీ మృతితో కాశ్మీర్‌లో ఉద్రిక్తత..

Latest News

  • Murder Sketch : రెండో భార్యపై మర్డర్ స్కెచ్ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిన వ్యక్తి

  • సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. హరీశ్ రాణా కారుణ్య మరణానికి అనుమతి

  • కడియం,దానంకు క్లీన్ చిట్.. అనర్హత పిటిషన్లను కొట్టేసిన స్పీకర్‌

  • ఇరాన్ – అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంతో.. వియత్నాం, థాయ్‌లాండ్ లో ఇంధన సంక్షోభం

  • రైతులకు శుభవార్త.. 13న పీఎం కిసాన్‌ నిధుల విడుదల

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd