HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >India Us Trade Deal

అట్లుంటది మోదీ తో.. అర్థమైందా ట్రంప్ రాజా!

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై గతంలో చేసిన 'టారిఫ్ ' వ్యాఖ్యల నుండి, నేడు సుంకాలు తగ్గించే వరకు చేయడంలో మోడీ సక్సెస్ అయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌పై సుంకాల యుద్ధం ప్రకటిస్తారని ప్రపంచ దేశాలు భావించాయి

  • Author : Sudheer Date : 03-02-2026 - 1:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Modi Master Mind
Modi Master Mind

India-US Trade Deal : అంతర్జాతీయ దౌత్య రంగంలో భారత్ తన సత్తా చాటుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై గతంలో చేసిన ‘టారిఫ్ ‘ వ్యాఖ్యల నుండి, నేడు సుంకాలు తగ్గించే వరకు చేయడంలో మోడీ సక్సెస్ అయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌పై సుంకాల యుద్ధం ప్రకటిస్తారని ప్రపంచ దేశాలు భావించాయి. గతంలో ఆయనే స్వయంగా భారత్‌ను ‘టారిఫ్ కింగ్’ అని సంబోధించారు. అయితే, ప్రధాని మోదీ నేతృత్వంలోని భారత్ ఏమాత్రం బెదరకుండా తనదైన శైలిలో ‘సైలెంట్ చాణక్యం’ నడిపింది. ఇతర పొరుగు దేశాల పాలకల్లా అమెరికా ముందు మోకరిల్లడం కాకుండా, అంతర్జాతీయ వేదికపై తన బలాన్ని పెంచుకునే వ్యూహాన్ని అమలు చేసింది. అమెరికాకు ప్రత్యామ్నాయంగా యూరోపియన్ యూనియన్ (EU) వంటి ఇతర శక్తివంతమైన కూటములతో ఆర్థిక బంధాన్ని బలపరుచుకోవడం ద్వారా ట్రంప్‌కు పరోక్షంగా గట్టి సంకేతాలు పంపింది.

భారత్ తన మార్కెట్ శక్తిని అస్త్రంగా వాడుకుంది. యూరోపియన్ యూనియన్‌తో ‘మదర్ ఆఫ్ డీల్స్’ పేరుతో అతిపెద్ద వాణిజ్య ఒప్పందానికి సిద్ధమై ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇటు కెనడా వంటి దేశాలు కూడా భారత్‌తో కలిసి నడవడానికి ఆసక్తి చూపడం అమెరికాను ఆలోచనలో పడేసింది. భారత మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతుండటం, అమెరికా కంపెనీలకు భారత్ ఒక అనివార్యమైన మార్కెట్ కావడంతో ట్రంప్ స్వరం మారక తప్పలేదు. ఒకప్పుడు 50 శాతం టారిఫ్స్ విధిస్తామని బెదిరించిన అమెరికా, ఇప్పుడు వాటిని 18 శాతానికి తగ్గించడం మోదీ దౌత్య విజయానికి నిదర్శనం.

US Tariffs

US Tariffs

ఈ పరిణామం వల్ల భారతీయ ఎగుమతిదారులకు, ముఖ్యంగా ఐటీ, ఫార్మా, మరియు వ్యవసాయ రంగాలకు భారీ ప్రయోజనం కలగనుంది. ప్రధాని మోదీ అనుసరించిన ‘ఈక్వల్ పార్టనర్’ (సమాన భాగస్వామి) విధానం వల్ల అమెరికా వంటి అగ్రరాజ్యాలు కూడా భారత్‌ను గౌరవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. బెదిరింపులకు లొంగకుండా, దేశ ప్రయోజనాలే పరమావధిగా అడుగులు వేయడం వల్లే ‘ట్రంప్ రాజా’ ఫ్రెండ్ అంటూ సుంకాలు తగ్గించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది కేవలం ఆర్థిక విజయమే కాదు, ప్రపంచ చిత్రపటంలో మారుతున్న భారత ప్రాభవానికి నిదర్శనం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • India Govt
  • modi
  • modi trump
  • trade agreement with India
  • Trump
  • Trump Tariffs
  • US President Donald Trump

Related News

Pawan Praises Modi's Leader

మోడీ నాయకత్వంపై పవన్ ప్రశంసలు..ఫిదా అంటున్న బిజెపి శ్రేణులు

భారత ఆర్థిక వ్యవస్థను అంతర్జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకుంటున్న చర్యలు అద్భుతమని పవన్ కల్యాణ్ కొనియాడారు. కేవలం ఒకే వారంలో రెండు కీలకమైన వాణిజ్య ఒప్పందాల దిశగా అడుగులు వేయడం మోదీ వ్యూహరచనకు నిదర్శనమని

  • Trump Tariffs On India Redu

    భారత్‌పై సుంకాలు తగ్గింపు..గుడ్‌న్యూస్ చెప్పిన ట్రంప్

  • Record Vehicle Sales In Jan

    జనవరిలో రికార్డు స్థాయి వాహన అమ్మకాలు

  • T20 World Cup

    పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

  • T20 World Cup

    టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

Latest News

  • నాని-సుజిత్ మూవీ క్రేజీ అప్డేట్!

  • అట్లుంటది మోదీ తో.. అర్థమైందా ట్రంప్ రాజా!

  • మద్యం ధరలపై పవన్ ఆగ్రహం !!

  • ఏపీని కాపాడండి అంటూ పార్లమెంట్ వద్ద వైసీపీ ఎంపీల ఆందోళన

  • పవన్ పై రాజకీయం చేయొద్దు.. అయన పేరు చెడగొట్టొద్దు మరో వీడియో విడుదల చేసిన మహిళా ఉద్యోగి !

Trending News

    • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించిన పాకిస్తాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd