Russia-Ukraine conflict: రష్యా-ఉక్రెయిన్ సమస్యలు శాంతియుతంగా పరిష్కరించుకోవాలి: అజిత్ దోవల్
ఉక్రెయిన్‌లో నెలకొన్న వివాదానికి శాంతియుత పరిష్కార లక్ష్యంతో సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో జరుగుతున్న రెండు రోజుల సదస్సుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు
- Author : Praveen Aluthuru
Date : 06-08-2023 - 10:30 IST
Published By : Hashtagu Telugu Desk
Russia-Ukraine conflict: ఉక్రెయిన్‌లో నెలకొన్న వివాదానికి శాంతియుత పరిష్కార లక్ష్యంతో సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో జరుగుతున్న రెండు రోజుల సదస్సుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. ఆయనతో పాటు పలు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సుకు సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ హోస్ట్‌గా వ్యవహరించారు. దాదాపు 40 దేశాలకు చెందిన టాప్ సెక్యూరిటీ అధికారులు ఇందులో పాల్గొన్నారు.
వివాదం ప్రారంభమైనప్పటి నుండి భారతదేశం అత్యున్నత స్థాయిలో రష్యా మరియు ఉక్రెయిన్‌లతో క్రమం తప్పకుండా చర్చలు జరుపుతోందని దోవల్ సమావేశంలో చెప్పారు. ఐక్యరాజ్యసమితి చార్టర్ మరియు అంతర్జాతీయ చట్టంలో పొందుపరచబడిన చట్టాల ఆధారంగా భారతదేశం మద్దతు ఇస్తుందని ఆయన అన్నారు. ఈ రెండు దేశాల శాశ్వతమైన పరిష్కారం కోసం అందర్నీ కలుపుకొని ప్రయత్నాలతో ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ఈ రెండు దేశాల్లో నెలకొన్న పరిస్థితులు కారణంగా ప్రపంచ దేశాలు ఆ నష్టాన్ని భరిస్తున్నాయని దోవల్ అన్నారు. భారతదేశం ఉక్రెయిన్‌కు మానవతా సహాయం ఆర్థిక సహాయం అందిస్తోందన్నారు.
Also Read: Gyanvapi Mosque Survey : జ్ఞానవాపి మసీదు సర్వేపై హిందూ పక్షం న్యాయవాది కీలక ప్రకటన