Imran Khan: పాకిస్తాన్ లో ఎన్నికలు ప్రకటించి ఉంటే వరదలు వచ్చేవి కావట…!!!
పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ విచిత్రమైన ప్రకటన చేశారు.
- By hashtagu Published Date - 10:13 AM, Sun - 2 October 22

పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ విచిత్రమైన ప్రకటన చేశారు. దేశంలో ఎన్నికలు ప్రకటించి ఉంటే దేశం ముంపునకు గురైది కాదని..రూపాయి పతనం అయ్యేదని కాదంటూ వ్యాఖ్యనించారు. గత కొద్దిరోజులుగా ఆర్మీచీఫ్ తోపాటు ఇతర ఉన్నతాధికారులతో ఇమ్రాన్ ఖాన్ భేటీ అవ్వడం రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఓ ఇంటర్వ్యూలోనూ ఈ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు ఇమ్రాన్ ఖాన్. మీరు ప్రధానమంత్రి కార్యాలయానికి వెళ్లారా లేదా ప్రశ్నించగా…నేను అబద్దాలు చెప్పను…నిజం చెప్పలేనంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు తాను ఎన్నికలకు సిద్ధంగా ఉన్నానని …ప్రభుత్వం తన స్వలాభం కోసం వాయిదా వేసిందన్నారు. గత 5 నెలలుగా ఎన్నికలు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నప్పటికీ పట్టించుకోవడం ఆరోపించారు.
ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికలు ప్రకటించి ఉంటే..ఇవాళ దేశంలో ప్రకృతి వైపరీత్యం వచ్చేది కాదన్నారు. అలాగే ద్రవ్యోల్బణం ఇంత తీవ్రంగా ఉండేది కాదంటూ చెప్పుకొచ్చారు. అలాగే పాకిస్థాన్ రూపాయి పరిస్థితి ఇంత దారుణంగా ఉండేది కాదని విచిత్ర వ్యాఖ్యలు చేశారు ఇమ్రాన్ ఖాన్ . ప్రకృతి వైపరీత్యం రాకుండా ఉండేందుకు ఏం ప్లాన్ చేశారో ఇంటర్వ్యూలో చెప్పలేదు. అలాగే పాకిస్థానీలు రూపాయిని ఎలా స్థిరపరుస్తారో కూడా వివరించలేదు. మొత్తానికి ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.