Army In Hospital : గాజా హాస్పిటల్‌లో సైన్యం తనిఖీలు.. ఏమైందంటే ?
Army In Hospital : గత మూడు రోజులుగా గాజాలోని అల్ షిఫా ఆస్పత్రి పరిసరాలను దిగ్బంధించిన ఇజ్రాయెల్ ఆర్మీ.. ఎట్టకేలకు బుధవారం ఉదయం ఆస్పత్రిలోకి ప్రవేశించింది.
- By Pasha Published Date - 06:07 PM, Wed - 15 November 23

Army In Hospital : గత మూడు రోజులుగా గాజాలోని అల్ షిఫా ఆస్పత్రి పరిసరాలను దిగ్బంధించిన ఇజ్రాయెల్ ఆర్మీ.. ఎట్టకేలకు బుధవారం ఉదయం ఆస్పత్రిలోకి ప్రవేశించింది. ఆస్పత్రి అంతా ముమ్మర తనిఖీలు చేసింది. గాల్లోకి కాల్పులు జరుపుతూ.. హమాస్ మిలిటెంట్ల కోసం గదులన్నీ వెతికింది. ఆస్పత్రిలోని ఐసీయూ రూమ్స్, స్టోరేజీ రూమ్స్, నీటి ట్యాంకులు సహా ప్రతిచోటా ఇజ్రాయెలీ సైనికులు సోదాలు చేశారు. చివర్లో అల్ షిఫా ఆస్పత్రి సెల్లార్‌లోకి వెళ్లి చూశారు. సెల్లార్ కింద ఏవైనా సొరంగాలను నిర్మించారా ? లేదా ? అనేది చెక్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
అయితే ఈ తనిఖీల్లో ఇజ్రాయెల్ ఆర్మీ ఏం గుర్తించింది ? ఈ రైడ్‌పై తమ దేశ ప్రభుత్వాన్ని ఏవిధమైన నివేదికను పంపింది ? అనేది ఇంకా తెలియరాలేదు. ఇక తనిఖీని నిర్వహించడానికి ముందు .. పెద్దసంఖ్యలో ఆస్పత్రిలోకి ఎంటరైన ఇజ్రాయెలీ సంఖ్యలో అక్కడున్న రోగులు, వైద్యసిబ్బంది అందరినీ బయటకు పంపించేశారు. తనిఖీల అనంతరం ఆస్పత్రి నిర్వాహకులకు ఇంక్యుబేటర్లు, శిశువులకు ఆహారం, వైద్య సామాగ్రిని పంపిణీని అందించామని ఇజ్రాయెల్ సైన్యం(Army In Hospital) ఓ ప్రకటన రిలీజ్ చేసింది.