Galwan Clash: భారత సైనికుల దెబ్బతో కోమాలోకి.. ఆ చైనీయుడికి వరుస సత్కారాలు
2022లో చైనాలోని బీజింగ్‌లో వింటర్ ఒలింపిక్స్(Galwan Clash) జరిగాయి.
- By Pasha Published Date - 01:19 PM, Mon - 3 March 25

Galwan Clash: గల్వాన్ లోయ సరిహద్దుల్లో 2020 జూన్ 15న భారత్, చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. చేతిలో తుపాకులు, ఆయుధాలు లేవు. అయినా రాళ్లు, కర్రలు, రాడ్లతో ఇరుదేశాల సైనికులు తీవ్రంగా కొట్టుకున్నారు. భారత సైనికుల తడాఖాకు గల్వాన్ లోయ సరిహద్దుల్లో చైనా సైన్యాన్ని లీడ్ చేసిన లెఫ్టినెంట్ కల్నల్ క్వి ఫబావో (Qi Fabao) తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడు కోమాలోకి వెళ్లాడు. చివరకు 2021 డిసెంబరు వరకు డ్యూటీకి వెళ్లలేని పరిస్థితిలో క్వి ఫబావో దుర్భరమైన జీవితాన్ని గడిపాడు. దీన్నిబట్టి భారత సైనికులు తమ చేతులతో అతడిని ఎలా చీల్చి చెండాడారో మనం అర్థం చేసుకోవచ్చు. కొత్త అప్‌డేట్ ఏమిటంటే.. కోమాలోకి వెళ్లి వచ్చిన క్వి ఫబావోను మరోసారి చైనా ప్రభుత్వం సత్కరించింది. ఆదివారం చైనా రాజధాని బీజింగ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో క్వి ఫబావో చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ (సీపీపీసీసీ) అవార్డును అందజేశారు. సీపీపీసీసీ సభ్యుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన వారికి ఈ అవార్డును అందిస్తుంటారు. సీపీపీసీసీ అనేది చైనాలో ఓ రాజకీయ సలహా కమిటీ. ఇది అక్కడి ప్రభుత్వంలో కీలకమైన విభాగం. రాజకీయ, సామాజిక అంశాలపై చైనా ప్రభుత్వానికి ఈ కమిటీ సలహాలు, సూచనలు ఇస్తుంటుంది.
Also Read :Medha Patkar : ‘మూసీ’ అలర్ట్.. హైదరాబాద్‌లో మేధాపాట్కర్.. అడ్డుకున్న పోలీసులు
2022లోనూ క్వి ఫబావోకు ఆ ఛాన్స్
2022లో చైనాలోని బీజింగ్‌లో వింటర్ ఒలింపిక్స్(Galwan Clash) జరిగాయి. వాటిలోనూ టార్చిబేరర్‌గా పాల్గొనేందుకు క్వి ఫబావోకు చైనా అవకాశం ఇచ్చింది. అయితే అప్పట్లో ఈ నిర్ణయాన్ని అమెరికా సెనెట్ ఫారన్ రిలేషన్స్ కమిటీ తప్పుపట్టింది. చైనాలోని వీఘర్ ముస్లింల అణచివేతలో అతడు కీలక పాత్ర పోషించాడని అమెరికా తెలిపింది. గల్వాన్ లోయలో భారత సైనికులతో ఘర్షణలోనూ క్వి ఫబావో కీలక పాత్ర పోషించాడు. భారత సైనికుల దెబ్బకు కోమాలోకి జారుకున్నాడు. లక్కీగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఇప్పుడు అతడికి వరుసపెట్టి సన్మానాలు, సత్కారాలు చేస్తూ.. చైనా మన దేశాన్ని కవ్విస్తోంది. అయినా భారత్ సంయమనంతో వ్యవహరిస్తోంది. సరిహద్దుల్లోనూ భారత్ శాంతిని కోరుకుంటోంది. అందుకే ఆ దేశంతో ఇటీవలే రష్యా వేదికగా శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
38 మంది చైనా సైనికులు హతం
మొత్తం మీద 2020 జూన్ 15న గల్వాన్ లోయ సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత వీర సైనికులు అమరులయ్యారు. మన దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారు. చైనా వైపున దాదాపు 38 మంది సైనికులు మట్టికరిచారు. అయితే చైనా మాత్రం తమ నలుగురు సైనికులే చనిపోయారని ప్రగల్భాలు పలుకుతోంది.