Imran Khan Arrest: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. గత కొంతకాలంగా ఇమ్రాన్ ఖాన్ వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. పాక్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేస్తున్న ఇమ్రాన్
- By Praveen Aluthuru Published Date - 03:43 PM, Tue - 9 May 23

Imran Khan Arrest: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. గత కొంతకాలంగా ఇమ్రాన్ ఖాన్ వార్తల్లో ఎక్కువగా నిలుస్తున్నారు. పాక్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే వ్యాఖ్యలు చేస్తున్న ఇమ్రాన్ తాజాగా ఆ దేశ విదేశాంగ మంత్రి భారత్ లో పర్యటించిన విషయాన్నీ తప్పుబడుతూ మండిపడ్డారు. మరోవైపు పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
Video of Imran Khan’s arrest. pic.twitter.com/UOGSDEDs2K
— Ihtisham Ul Haq (@iihtishamm) May 9, 2023
పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. ఇమ్రాన్ ఖాన్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు వద్ద పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్ స్థానిక వార్తా సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్‌ను పారామిలటరీ ఫోర్స్ మంగళవారం అరెస్టు చేసింది. అవినీతి కేసులో ఇమ్రాన్‌ఖాన్‌ను ఇస్లామాబాద్‌లోని కోర్టు ప్రాంగణంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఖాదిర్ ట్రస్ట్ కేసులో ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేశారు’’ అని ఇస్లామాబాద్ పోలీసు అధికారిక ట్విట్టర్ ఖాతాలో అక్రమాస్తుల కేసును ప్రస్తావిస్తూ పేర్కొంది.
PTI released Imran Khan’s recorded video. pic.twitter.com/VCdkwF4fsX
— Ihtisham Ul Haq (@iihtishamm) May 9, 2023
Read More: Student Suicide: ఇంటర్ పరీక్షలో ఫెయిల్.. విద్యార్థి ఆత్మహత్య!