Wildfire : దక్షిణ కొరియాలో కార్చిచ్చు.. 19 మంది మృతి
వీటి ధాటికి 1,300 ఏళ్ల నాటి బౌద్ధ దేవాలయం కూడా దగ్ధమైంది. అయితే, ఆలయంలోని కళాఖండాలతో సహా పలు విగ్రహాలను ముందే ఇతర దేవాలయాలకు తరలించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మంటల కారణంగా ఇప్పటివరకు దాదాపు 19 మంది మృతి చెందారు. మరో 19 మంది గాయపడ్డారు.
- By Latha Suma Published Date - 01:47 PM, Wed - 26 March 25

Wildfire : దక్షిణ కొరియాలో అనూహ్యంగా కార్చిచ్చు రేగింది. సాధారణంగా పశ్చిమ దేశాల్లో కనిపించే తరహా కార్చిచ్చు ఇప్పుడు ఈ దేశాన్ని ముంచెత్తుతోంది. ఇక ఈ మంటలను ఆర్పేందుకు వెళ్లిన రెస్క్యూ హెలికాప్టర్ కూడా కార్చిచ్చులో కూలిపోయింది. దక్షిణ కొరియాలోని ఉయిసాంగ్ కౌంటీలో దావానలం రేగింది. ఈ మంటలు చకచకా చుట్టేస్తున్నాయి. గంటకు కొన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. వీటి ధాటికి 1,300 ఏళ్ల నాటి బౌద్ధ దేవాలయం కూడా దగ్ధమైంది. అయితే, ఆలయంలోని కళాఖండాలతో సహా పలు విగ్రహాలను ముందే ఇతర దేవాలయాలకు తరలించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. మంటల కారణంగా ఇప్పటివరకు దాదాపు 19 మంది మృతి చెందారు. మరో 19 మంది గాయపడ్డారు.
Read Also: Ippala Ravindra Reddy : అప్పుడు చంద్రబాబును తిట్టి..ఇప్పుడు లోకేష్ కు దగ్గర అవుతున్నాడా..?
పొడి గాలుల కారణంగా మంటలు వేగంగా వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. దీని కారణంగా వాటిని అదుపు చేయడంలో అధికారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఉత్తర, దక్షిణ జియోంగ్‌సాంగ్, ఉల్సాన్ నగరంలోని అనేక ప్రాంతాల్లో మాత్రం మంటలు చురుకుగా వ్యాపిస్తున్నాయి. ఈ కార్చిచ్చును ఆర్పేందుకు 10 వేల మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది, పౌర సేవకులు శ్రమిస్తున్నారు. కార్చిచ్చు వల్ల బుధవారం నాటికి 43 వేల ఎకరాలు కాలి బూడిదయ్యాయని అధికారులు వెల్లడించారు. స్థానిక నివాసితులను ఖాళీ చేయమని ఇప్పటికే ఆదేశించినట్లు వెల్లడించారు. 68 శాతం మంటలు అదుపులోకి వచ్చాయన్నారు.
కాగా, దక్షిణ కొరియా ప్రధానమంత్రి, తాత్కాలిక అధ్యక్షుడు హన్ డక్- సూ ఈ కార్చిచ్చుపై స్పందించారు. ఇది అత్యంత ఘోరమైనది. ఈ మంటల కారణంగా అపూర్వమైన నష్టం ఏర్పడింది. దీనికి మేము ఎంతో ఆందోళన చెందుతున్నాం. మంటలను అదుపు చేయడంపై ప్రత్యేక దృష్టిసారించాం. ఇవి పొరుగు ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేందుకు ప్రజలు అధికారులకు సహకరించాలని కోరుతున్నా అని ఆయన పేర్కొన్నారు. ఇక, ఎక్కడైనా సరే గాలులు లేకుంటేనే కార్చిచ్చులను వెంటనే ఆర్పగలం. ఇప్పుడు దక్షిణ కొరియాలో పొడి గాలులతో దావానాలం చెలరేగుతోంది. అదుపు చేయడంలో అధికారులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
Read Also: Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీలో “భూ భారతి”పై వాడీవేడి చర్చ