New Orleans Attack: ట్రక్కు దాడి.. మాజీ సైనికుడు షంషుద్దీన్ జబ్బార్ పనే : జో బైడెన్
న్యూ ఇయర్ మొదటిి రోజున అమెరికాలోని లూసియానా రాష్ట్రం న్యూ ఆర్లియన్స్(New Orleans Attack) నగరంలో జనంపైకి ట్రక్కు దూసుకెళ్లిన ఘటనలో 15 మంది చనిపోగా, 30 మంది గాయాలపాలయ్యారు.
- By Pasha Published Date - 08:22 AM, Thu - 2 January 25

New Orleans Attack: న్యూ ఇయర్ మొదటి రోజున అమెరికాలోని లూసియానా రాష్ట్రం న్యూ ఆర్లియన్స్(New Orleans Attack) నగరంలో జనంపైకి ట్రక్కు దూసుకెళ్లిన ఘటనలో 15 మంది చనిపోగా, 30 మంది గాయాలపాలయ్యారు. ఇంతకీ ఆ ట్రక్కును నడిపింది ఎవరు ? అతడి నేపథ్యం ఏమిటి ? అనే వివరాలపై స్వయంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన విడుదల చేశారు. దుండగుడిని టెక్సాస్‌కు చెందిన షంషుద్దీన్ జబ్బార్‌గా(42) గుర్తించినట్లు బైడెన్ తెలిపారు. అతడు అమెరికా పౌరుడేనని చెప్పారు.
Also Read :CM Revanth: సీఎం రేవంత్‌లో సడెన్ ఛేంజ్.. మంత్రులు, ఎమ్మెల్యేలకు క్లాస్!
‘‘జబ్బార్ గతంలో అమెరికా ఆర్మీలో చాలా ఏళ్లపాటు పనిచేశాడు. కొన్నేళ్ల క్రితం ఆర్మీ రిజర్వ్ యూనిట్‌లో కూడా సేవలు అందించాడు. షంషుద్దీన్ జబ్బార్ జనంపైకి నడిపిన ట్రక్కులో ఐసిస్ జెండాను గుర్తించాం. ట్రక్కు దాడికి పాల్పడటానికి కొన్ని గంటల ముందు సోషల్ మీడియాలో జబ్బార్ ఒక పోస్ట్ చేశాడు. దాన్నిబట్టి అతడు ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ నుంచి ప్రేరణ పొందాడని తేలింది’’ అని బైడెన్ వివరించారు. ‘‘జబ్బార్ నడిపిన ట్రక్కులో పేలుడు పదార్థాలు కూడా లభ్యమయ్యాయి. దీనిపై ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోంది’’ అని ఆయన వెల్లడించారు. ఇక న్యూఆర్లియన్స్‌లోని బార్బన్ వీధిలో జనంపైకి ట్రక్కును నడిపిన అనంతరం షంషుద్దీన్ జబ్బార్ కిందికి దిగి.. జనంపైకి కాల్పులు జరిపాడు. ఈక్రమంలో అతడిపైకి పోలీసులు ప్రతికాల్పులు జరిపారు. దీంతో జబ్బార్ చనిపోయాడు. జబ్బార్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. న్యూఆర్లియన్స్‌లోని బార్బన్ వీధి కొత్త సంవత్సరం వేడుకలకు వరల్డ్ ఫేమస్.
Also Read :Rashmika : టాలీవుడ్ హీరోతొనే రష్మిక పెళ్లి.. నిర్మాత చెప్పేశాడు..!
ఈ ట్రక్కు దాడి ఘటనలో జబ్బార్ ఒక్కడే లేడని.. ఇంకా కొందరి పాత్ర కూడా ఉందని ఎఫ్‌బీఐ అసిస్టెంట్ స్పెషల్ ఏజెంట్ ఇన్‌ఛార్జ్ అలెథియా డంకన్ వెల్లడించారు. ‘‘ఈ దాడి జరిగిన వీధిలోని సీసీటీవీ ఫుటేజీని మేం పరిశీలించాం.. ముగ్గురు పురుషులు, ఒక మహిళ ఒక పేలుడు పదార్థాన్ని అమరుస్తూ కనిపించారు. అయితే వాళ్లు ఎవరనేది గుర్తించే పనిలోనే మేం ఉన్నాం. ఆ వీధిలో పేలుళ్ల కోసం ఐఈడీలు, పైప్ బాంబులు కూడా అమర్చారని గుర్తించాం. ఒక హ్యాండ్ గన్, ఏఆర్ స్టైల్ రైఫిల్ లభ్యమయ్యాయి’’ అని డంకన్ చెప్పారు.