Trumps Advisors: ట్రంప్ సలహా సంఘంలోకి ఇద్దరు ఉగ్రవాదులు ?
అమెరికా అధ్యక్షుడి సలహా సంఘంలో ఇటీవలే ఇస్మాయిల్ రాయర్, షేక్ హమ్జా యూసుఫ్‌లకు(Trumps Advisors) చోటు లభించింది.
- By Pasha Published Date - 11:58 AM, Mon - 19 May 25

Trumps Advisors: అమెరికా అంటే అగ్రరాజ్యం. ప్రపంచ దేశాలకు పెద్దన్న. అలాంటి అమెరికా దేశానికి అధ్యక్షుడు అంటే ఆషామాషీ విషయం కాదు. అమెరికా ప్రెసిడెంట్‌గా ఉన్న వారికి చాలా పవర్స్ ఉంటాయి. ఎన్నో అంతర్జాతీయ, ఆర్థిక, వాణిజ్య, సైనిక, రాజకీయ అంశాలను వాళ్లు కంట్రోల్ చేయగలరు. ఈ అంశాలపై సలహాలు ఇవ్వడానికి అమెరికా అధ్యక్షుడికి ఒక ప్రత్యేకమైన సలహా సంఘం ఉంటుంది. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కూడా ఒక సలహా సంఘం ఉంది. దీనిలో వివిధ రంగాల నిష్ణాతులకు మాత్రమే చోటు లభిస్తుంది. అయితే తాజాగా ఇద్దరు మాజీ ఉగ్రవాదులకు సైతం ఈ సంఘంలో చోటు దక్కింది. వాళ్లెవరో ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :Congress Vs Shashi Tharoor: శశిథరూర్‌పై వేటుకు కాంగ్రెస్ రెడీ అవుతోందా ?
ఆ సలహా సంఘంలోకి ఉగ్రవాదులు.. ట్రంప్ సర్కారు వాదన ఇదీ
అమెరికా అధ్యక్షుడి సలహా సంఘంలో ఇటీవలే ఇస్మాయిల్ రాయర్, షేక్ హమ్జా యూసుఫ్‌లకు(Trumps Advisors) చోటు లభించింది. వారిద్దరికీ వివాదాస్పద నేపథ్యం ఉంది. పలు ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలతో ఈ ఇద్దరికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా లింకులు ఉన్నాయి. ఇస్మాయిల్, షేక్ హమ్జా విషయంలో ట్రంప్ సర్కారు వాదన మరోలా ఉంది. వీరిద్దరికి రిలీజియస్ లిబర్టీ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేసే అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ లే లీడర్స్‌లో సభ్యులుగా చోటు ఇవ్వడంలో తప్పేం లేదని అమెరికా ప్రభుత్వం అంటోంది. ఇస్మాయిల్, షేక్ హమ్జాలు అమెరికాలో ఇస్లామిక్ బోధనల్లో మంచిపేరు తెచ్చుకున్నారని చెబుతోంది. అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ లే లీడర్స్ అనేది మతస్వేచ్ఛ, మత విశ్వాసాలకు అనుగుణంగా విధాన నిర్ణయాల్లో అమెరికా అధ్యక్షుడికి సలహాలు ఇస్తుంది. దీనిలో ఉగ్రవాద సానుభూతిపరులకు చోటు దక్కడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read :Pakistani Spies : హర్యానాలో పాక్ గూఢచారుల ముఠా.. పహల్గాం ఉగ్రదాడితో లింక్ ?
ఇస్మాయిల్ రాయర్ గురించి..
- ఇస్మాయిల్ రాయర్ అమెరికా జాతీయుడు. ఇతడి అసలు పేరు ర్యాండల్ టోడ్ రాయర్.
- ర్యాండల్ టోడ్ రాయర్ 1992లో క్రైస్తవ మతం నుంచి ఇస్లాంలోకి మారాడు.
- పాకిస్తాన్‌లోని లష్కరే తైబా, ఈజిప్టులోని ముస్లిం బ్రదర్‌హుడ్, అమెరికాలోని వర్జీనియా జిహాద్ నెట్‌వర్క్, పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాద సంస్థతో ఇస్మాయిల్‌కు లింకులు ఉన్నాయి.
- ఉగ్రవాద శిక్షణ పొందేందుకు ఇస్మాయిల్ 2000లో పాకిస్తాన్‌కు వెళ్లాడు. ఆ టైంలోనే అల్ ఖైదా, లష్కరే తైబా ఉగ్రవాద సంస్థలతో లింకులు ఏర్పడ్డాయి.
- అల్ ఖైదా, లష్కరే తైబాలకు సహకరిస్తున్నాడనే అభియోగాలతో 2003లో ఇస్మాయిల్‌పై కేసు నమోదైంది. అతడు దోషిగా తేలాడు. దీంతో 20 ఏళ్ల జైలుశిక్ష పడింది.
- అయితే స్రత్పవర్తన కారణంగా 2017లో రిలీజ్ చేశారు.
- ప్రస్తుతం అమెరికాలోని రిలీజియస్ ఫ్రీడం ఇన్‌స్టిట్యూట్‌లో ఇస్మాయిల్ డైరెక్టర్‌గా ఉన్నాడు.
షేక్ హమ్జా యూసుఫ్ గురించి..
- అమెరికాలోని తొలి ముస్లిం లిబరల్ ఆర్ట్స్ కాలేజీ అయిన జేతునా కాలేజీ సహ వ్యవస్థాపకుడే షేక్ హమ్జా యూసుఫ్.
- ఈ కాలేజీలో షరియా చట్టాలను బోధిస్తారు.
- యూసుఫ్‌కు ఈజిప్టుకు చెందిన ముస్లిం బ్రదర్‌హుడ్, పాలస్తీనాకు చెందిన హమాస్‌లతో లింకులు ఉన్నాయి.
- అమెరికా జాత్యహంకార దేశమని అతడు గతంలో వ్యాఖ్యలు చేశాడు.
- 1990వ దశకం నాటి న్యూయార్క్ బాంబు దాడుల కేసు నిందితుడు షేక్ ఒమర్ అబ్దుల్ రహ్మాన్‌పై దర్యాప్తులో అమెరికా ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదని అప్పట్లో షేక్ హమ్జా యూసుఫ్ విమర్శించాడు.
- అమెరికా పోలీస్ ఉన్నతాధికారిని హత్య చేసిన జమీల్ అల్ అమీన్ అనే వ్యక్తికి మద్దతుగా యూసుఫ్ ప్రసంగించాడు.
- ముస్లిం దేశాల్లో ప్రముఖ ఇస్లామిక్ విద్యావేత్తగా ఇతడు పేరొందాడు.