Trump Peace Plan : రష్యా – ఉక్రెయిన్ వార్.. డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రణాళిక ఇదీ
రష్యా-ఉక్రెయిన్ మధ్య దాదాపు 1300 కి.మీ బఫర్ జోన్‌ను క్రియేట్ చేసేందుకు ఐరోపా దేశాలు ప్రయత్నించాలని ట్రంప్(Trump Peace Plan) ప్రతిపాదించబోతున్నారట.
- Author : Pasha
Date : 10-11-2024 - 10:09 IST
Published By : Hashtagu Telugu Desk
Trump Peace Plan : 2022 ఫిబ్రవరి 24 నుంచి ఇప్పటి వరకు రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధాన్ని ఆపుతానని చెబుతూ వస్తున్న ట్రంప్.. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచాక ఆ దిశగా కసరత్తును ముమ్మరం చేశారు. ప్రస్తుతం దీనిపై తన టీమ్‌తో ట్రంప్ మేధోమధనం చేస్తున్నారు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ఉన్న అత్యుత్తమ మార్గాలను అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుతం ట్రంప్ మదిలో ఉన్న శాంతి ప్రణాళిక వివరాలు బయటికి వచ్చాయి. దాని ప్రకారం.. ఉక్రెయిన్‌కు అమెరికా తన సైన్యాలను అస్సలు పంపబోదు. ఉక్రెయిన్ అనేది తూర్పు యూరోపియన్ దేశం. అందుకే సైనికపరమైన అవసరమే తలెత్తిన యూరోపియన్ దేశాలు మాత్రమే స్పందించాలని ట్రంప్ భావిస్తున్నారట. ఆ రిస్క్‌ను అమెరికా తీసుకోదని ఆయన వాదిస్తున్నారట. అమెరికాకు సైనిక నష్టం జరగకుండా.. శాంతి ప్రణాళిక ఉండాలని ఆయన తన సన్నిహితులతో చెబుతున్నారట.
Also Read :Elevated Corridor : తెలంగాణ, ఏపీ నడుమ ఎలివేటెడ్ కారిడార్.. హైట్ 30 అడుగులు
రష్యా-ఉక్రెయిన్ మధ్య దాదాపు 1300 కి.మీ బఫర్ జోన్‌ను క్రియేట్ చేసేందుకు ఐరోపా దేశాలు ప్రయత్నించాలని ట్రంప్(Trump Peace Plan) ప్రతిపాదించబోతున్నారట. పోలండ్, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్‌లు దీనికి సంబంధించిన ఉమ్మడి కసరత్తు చేయాలని ఆయన సూచించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ రిస్క్ తీసుకోవడానికి యూరోపియన్ దేశాలు సిద్ధపడే అవకాశం లేదు. రష్యాతో సైనిక ఘర్షణ అంటే దీర్ఘకాలం పోరాడాల్సి ఉంటుంది. ఒకవేళ అదే జరిగితే.. యూరోపియన్ దేశాలు ఆర్థికంగా నష్టపోతాయి. దానికి యూరోపియన్ దేశాలు నో చెప్పే అవకాశాలే ఎక్కువ.
Also Read :Russia : అమెరికాకు చెక్.. ఉత్తర కొరియాతో పుతిన్ మెగా డీల్.. ఏమిటి ?
‘‘ఉక్రెయిన్ భూభాగం నుంచి రష్యా బలగాలను వెనక్కి పిలుచుకోవాలి. క్రిమియాతో సహా రష్యా స్వాధీనం చేసుకున్న అన్ని భూభాగాలను మాకు తిరిగి ఇచ్చేయాలి. అప్పుడే శాంతి సాధ్యమవుతుంది’’ అని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అంటున్నారు. వాస్తవానికి క్రిమియాను రష్యా 2014లోనే స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఉక్రెయిన్ భూభాగంలో కేవలం 20 శాతం క్రిమియా మాత్రమే ఉంది.