HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Donald Trumps Visit To China

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన

  • Author : Vamsi Chowdary Korata Date : 13-05-2026 - 10:15 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Donald Trump Vs Xi Jinping
Donald Trump Vs Xi Jinping

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో కీలక చర్చల కోసం మంగళవారం చైనాకు బయలుదేరారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, ఇరాన్ వివాదం, తైవాన్ వంటి అంశాలు ఈ భేటీలో ప్రధాన అజెండాగా ఉండనున్నాయి. 2017 తర్వాత ఒక అమెరికా అధ్యక్షుడు చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి.

ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ ఈ పర్యటనకు వెళ్లారు. ఆయన బుధవారం బీజింగ్‌కు చేరుకోనుండగా, గురు, శుక్రవారాల్లో షీ జిన్‌పింగ్‌తో అధికారిక చర్చలు జరుపుతారు. “ట్రంప్ చైనాకు బయలుదేరారు” అంటూ వైట్‌హౌస్‌కు చెందిన ‘రాపిడ్ రెస్పాన్స్ 47’ ఎక్స్ ఖాతాలో చిత్రాలతో సహా పోస్ట్ చేశారు.

ఈ చర్చల్లో వాణిజ్య సంబంధాలే కీలకం కానున్నాయి. అమెరికాతో చైనాకు ఉన్న భారీ వాణిజ్య మిగులుపై ట్రంప్ మొదటి నుంచి అసంతృప్తితో ఉన్నారు. గత అక్టోబర్‌లో దక్షిణ కొరియాలో జరిగిన సమావేశంలో ఇరు దేశాల మధ్య టారిఫ్ యుద్ధానికి ఏడాది పాటు విరామం ప్రకటించారు. ప్రస్తుత భేటీలో ఈ అంశంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇరాన్‌తో కొనసాగుతున్న వివాదం కూడా ఈ భేటీలో ముఖ్యమైన అంశంగా మారింది. ఇరాన్‌పై తమ ప్రభావాన్ని ఉపయోగించి, వాషింగ్టన్‌తో దౌత్య ఒప్పందానికి సహకరించాలని ట్రంప్ చైనాను కోరనున్నట్లు సమాచారం. చైనా ఇరాన్‌కు కీలక ఆర్థిక భాగస్వామిగా, ఆ దేశ చమురుకు ప్రధాన కొనుగోలుదారుగా ఉన్న విషయం తెలిసిందే. ట్రంప్ పర్యటనలో ఆయనతో పాటు టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ఆపిల్ సీఈవో టిమ్ కుక్ వంటి అగ్రశ్రేణి వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. ట్రంప్ రాక సందర్భంగా బీజింగ్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • China Visit
  • Donald Trump
  • US China relations
  • xi jinping

Related News

Trump- PM Modi

Donald Trump Tariff: భారత్‌పై టారిఫ్స్ 25% నుంచి 15% తగ్గింపు : ట్రంప్ కీలక నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో శుభవార్త చెప్పారు. కొన్ని రకాల వ్యవసాయ, పారిశ్రామిక పరికరాలపైన దిగుమతి సుంకాలను 10 శాతం వరకు తగ్గించారు. అంతకుముందు 25 శాతంగా ఉండగా, దీనిని 15 శాతానికి తగ్గించారు. అయితే ఇది తాత్కాలిక తగ్గింపు మాత్రమేనని స్పష్టం చేశారు. ఇది 2027 డిసెంబర్ వరకు అమల్లో ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను చూద్దాం. ఒకవైపు అమెరికా-ఇరాన్

  • Donald Trump

    Donald Trump: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం

Latest News

  • Importance of Marriage: పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం తెలుసా?

  • PM Modi: జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.

  • DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప‍్రమాణం

  • CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

  • Khushboo: సీఎం విజయ్‌ని కలిసి కూతురి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన ఖుష్బూ దంపతులు

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd