Donald Trump: టారిఫ్ వార్.. చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్.. చైనా వెనక్కు తగ్గుతుందా..?
ట్రంప్ ప్రతీకార సుంకాలతో అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రమవుతోంది.
- By News Desk Published Date - 09:50 PM, Mon - 7 April 25

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలు విధించి టారిఫ్ వార్ కు తెరలేపాడు. భారత్, చైనా సహా దాదాపు 180కిపైగా దేశాలపై ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించాడు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లు కుదేలవుతున్నాయి. మరోవైపు ట్రంప్ టారిఫ్ వార్‌ను చైనా తీవ్రంగా ఖండించింది. అమెరికా నుంచి చైనాకు దిగుమతి అవుతున్న వస్తువులపై భారీగా టారిఫ్ లు విధించింది. దీంతో ట్రంప్ భగ్గుమన్నాడు. వెనక్కు తగ్గాలటూ చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చాడు.
Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ మరో సంచలనం.. భారీ రికార్డు నమోదు..
అమెరికాకు దిగుమతయ్యే అన్ని దేశాల ఉత్పత్తులపై కనీసం 10 శాతం టారీఫ్‌లు విధించిన అధ్యక్షుడు ట్రంప్.. గరిష్ఠంగా 49శాతం (అత్యధికంగా కంబోడియా) వరకు పన్నులు విధించారు. భారత్‌పై 26 శాతం, చైనా పై 34 శాతం, ఐరోపా దేశాలపై 20 శాతం వరకు సుంకాలు విధించారు. ఈ నేపథ్యంలో అమెరికా విధించిన టారిఫ్‌లపై చైనా మండిపడింది. పోటీగా అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై 34శాతం అదనపు సుంకం విధించనున్నట్లు చైనా ప్రకటించింది. ఈ మేరకు చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ ఇటీవల ప్రకటన విడుదల చేసింది. చైనా తీరుపై ట్రంప్ ఫైర్ అయ్యాడు. ప్రతీకార సుంకాలను వెనక్కు తీసుకోవాలంటూ తాజాగా చైనాకు ట్రంప్ డెడ్ లైన్ విధించాడు.
Also Read: Fact Check: కంచ గచ్చిబౌలిలో భూసేకరణ.. రోడ్లపైకి సింహాలు ?
ట్రంప్ ప్రతీకార సుంకాలతో అమెరికా, చైనా దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రమవుతోంది. ట్రంప్ ప్రతీకార సుంకాలకు పోటీగా చైనా సైతం ప్రతీకార సుంకాలను విధించడంతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏప్రిల్ 8వ తేదీ సాయంత్రంలోగా చైనా తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని.. లేదంటే ఏప్రిల్ 9వ తేదీ నుంచి చైనా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై 50శాతం టారిఫ్ లు విధిస్తామని ట్రంప్ హెచ్చరించాడు. అంతేకాదు.. చైనాతో చర్చలు కూడా నిలిపేస్తామని తేల్చి చెప్పాడు.
అయితే, ట్రంప్ హెచ్చరికలకు చైనా భయపడే అవకాశం లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ట్రంప్ తాజా హెచ్చరికలపై చైనాసైతం ధీటుగా స్పందిస్తే ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రరూపం దాల్చడం ఖాయమని, ఆ ప్రభావం ప్రపంచ దేశాలపైనా పడే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.