Virat Kohli: విరాట్ కోహ్లీ మరో సంచలనం.. భారీ రికార్డు నమోదు..
టీ20 క్రికెట్లో కోహ్లీ మరో భారీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
- By News Desk Published Date - 09:17 PM, Mon - 7 April 25

virat kohli: ఐపీఎల్ 18వ సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్ (MI) వర్సెస్ బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ (RCB) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేయగా.. విరాట్ కోహ్లీ ఆఫ్ సెంచరీతో అదరగొట్టాడు. 42 బంతుల్లో 67 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీ20 క్రికెట్లో కోహ్లీ మరో భారీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
Also Read: PBKS vs RR: పంజాబ్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం!
విరాట్ కోహ్లీ టీ20ల్లో 13వేల రన్స్ పూర్తి చేశాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన తొలి భారత క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. ముంబయితో మ్యాచ్ కు ముందు 12,983 పరుగులతో ఉన్న కోహ్లీ..ఈ మ్యాచ్ లో 17పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద 13వేల పరుగుల మార్క్ అందుకున్నాడు. 386 ఇన్నింగ్స్ లలో విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధించాడు. విరాట్ కంటే ముందు నలుగురు క్రికెటర్లు టీ20ల్లో 13వేల పరుగులు పూర్తి చేశారు. అయితే, 13వేల పరుగులు పూర్తిచేసిన తొలి ఇండియన్ బ్యాటర్ విరాట్ కోహ్లీనే.
Also Read: Rishabh Pant: పంత్ ఒక్కో పరుగు రూ. కోటిపైనే.. ఇప్పటివరకు చేసింది 21 పరుగులే!
టీ20ల్లో 13వేల పరుగులు చేసిన బ్యాటర్ల వివరాలను పరిశీలిస్తే.. క్రిస్ గేల్ (381 ఇన్నింగ్స్ లలో 14,562 పరుగులు), అలెక్స్ హేల్స్ (474 ఇన్నింగ్స్ లలో 13,610 పరుగులు), షోయబ్ మాలిక్ (487 ఇన్నింగ్స్ లలో 13,557 పరుగులు), కీరన్ పోలార్డ్ (594 ఇన్నింగ్స్ లలో 13,537 పరుగులు), విరాట్ కోహ్లీ (386 ఇన్నింగ్స్‌లలో 13,001 పరుగులు) చేశారు.
Virat Kohli completes 13,000 runs in T20 cricket. 🐐 pic.twitter.com/leeUHCXhfV
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 7, 2025